సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తాజా సమావేశాలు 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణను మార్గనిర్దేశం చేశాయి. ప్లీనరీ సమావేశాల్లో రెండోరోజు తెలంగాణ నుంచి వినయ్‌కుమార్, ప్రేమ్‌లాల్ మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఎస్.జైపాల్‌రెడ్డి, షబ్బీర్ అలీ, డీకే అరుణ, రాపోలు ఆనంద భాస్కర్, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, పి.సుధాకర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, ఆరేపల్లి మోహన్, సంపత్ కుమార్, రామ్మోహన్‌రెడ్డి, డి.నాగేందర్, వంశీచంద్‌రెడ్డి, పద్మావతిరెడ్డి, బండ కార్తీక రెడ్డి, దాసోజు శ్రవణ్, కురువ విజయ్‌కుమార్, పున్నా కైలాశ్, దయాకర్, పవన్ కుమార్ హాజరయ్యారు.
ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై ఆరా
ప్లీనరీ సమావేశాలు ముగిసిన తర్వాత వేదికపై పార్టీ నేతలు రాహుల్‌గాంధీతో ఫొటోలు దిగారు. అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాహుల్ వద్దకు వెళ్లి మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన వివాదంపై, సభ్యత్వాల రద్దుపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
‘ఐ యామ్ విత్ యు. మీరు మళ్లీ ఢిల్లీ వచ్చి కల వండి’ అని కోమటిరెడ్డికి చెప్పినట్టు సమాచారం. ఏపీ నుంచి ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సీని యర్ నేతలు పల్లంరాజు, జేడీ శీలం, సి.రామచంద్రయ్య, నాదెండ్ల మనోహర్, కనుమూరి బాపిరాజు, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment