
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భువన్‌చంద్ర ఖండూరి తనయుడు మనీష్ ఖండూరి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్‌గాంధీ అధ్యక్షతను డెహ్రాడూన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. మనీష్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్.. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
బీసీ ఖండూరి లోక్‌సభ స్థానమైన పౌరీ నుంచి ఆయన తనయుడు మనీష్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశముందని తెలుస్తోంది. రక్షణశాఖపై పార్లమెంటు స్థాయిసంఘం చైర్మన్‌గా ఉన్న బీసీ ఖండూరీని గత ఏడాది ఆ పదవిలోంచి తొలగించడం దుమారం రేపింది. ఆర్మీ మాజీ జనరల్ అయిన ఖండూరీని తొలగించి.. ఆయనను బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. మనీష్ గతంలో బిజినెస్ రిపోర్టర్‌గా, ఫేస్‌బుక్ న్యూస్ డిపార్ట్‌మెంట్ చీఫ్‌గా పలు ఉద్యోగాలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment