సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. గతంలో ఆయనను నమ్మినందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబు అసలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ... అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు పచ్చ మీడియా కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాఖ దూరమని చెప్పే పత్రికలు.. ఆనాడు హైదరాబాద్ దూరమని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.
ఎందుకంత ద్వేషం..
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అమర్‌నాథ్ అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. చెన్నై, హైదరాబాద్‌లో రాజధాని ఉంటే బాధ పడ్డామా.. అసలు విశాఖ అంటే ఎందుకంత ద్వేషం అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి.. అమరావతిలోని తన భూములు కాపాడుకోవడానికి బాబు తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. తన భూముల రేట్లు పెంచుకోవడానికే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లడమే తమ లక్ష్యమని అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన
పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ
అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..
విజయకుమార్గాడు మాకు చెబుతాడా!
మరోసారి చంద్రబాబు శవ రాజకీయాలు
Comments
Please login to add a commentAdd a comment