గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మేల్యే జెనీబెన్ థాకర్
గాంధీనగర్, గుజరాత్ : రైతుల సంక్షేమ కోసం అవసరమయితే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే అంటున్నారు గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మేల్యే జెనీబెన్ థాకర్. గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా జెనీబెన్ ‘ఒక ఎమ్మేల్యేగా నేను ఇలాంటి పదజాలం వాడకూడదు. కానీ రైతుల పరిస్థితి చూసాక నేను మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. అవసరమయితే రైతుల కోసం నేనే స్వయంగా ఆయుధాలు చేతబట్టి ఎవరినైనా చంపి, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం. రైతుల కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత పెద్ద విషయం అనిపించడం లేదు. రైతు సంక్షేమం కోసం ఏం చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది’ అన్నారు.
ఈ నెల 1 నుంచి పదిరోజుల పాటు (జూన్ 10 వరకూ) దేశవ్యాప్తంగా రైతులు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియానా రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. రుణ మఫీ, పంటలకు కనీస మద్దతు ధరతో పాటుగా స్వామీనాథన్ కమిషన్ సూచనలను అమలు చేయాలిన డిమాండ్ చేసారు. ఈ నిరసనలో భాగంగా రైతులు పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలను రవాణా చేయకుండా అడ్డుకోవడంతో మార్కెట్లో వాటి ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయిన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment