
సాక్షి, హైదరాబాద్: పరస్పర విరుద్ధమైన సిద్ధాం తాలు కలిగిన పార్టీలు ప్రజలను మోసం చేసేం దుకు మహా కూటమి పేరుతో జట్టు కట్టాయని సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసలు ఆ కూటమికి ఓట్లు అడిగే హక్కు లేదని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను మరోసారి దీవించాలని కోరారు. శనివారం అంథోల్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జోగినాథ్, జిల్లా కార్యదర్శి విజయ్‌లతోపాటు పలువురు నేతలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అందరూ కలసికట్టుగా పనిచేసి అంథోల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని హరీశ్‌రావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment