
సాక్షి, హైదరాబాద్ : జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 17,86,515 ఓట్లు పోలయ్యాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం 9,10, 437 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 4, 85, 913 ఓట్లు పురుషులవి కాగా 4,24,520 ఓట్లు మహిళలవి, ఇతరులవి నాలుగు ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం 8,76,078 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుష ఓటర్లు 4,77,929, మహిళా ఓటర్లు 4,24, 520, ఇతరులవి నాలుగు ఓట్లు ఉన్నాయి. ఇందులో సర్వీసు ఓటర్లు 382 మంది ఉన్నారు. సికింద్రాబాద్‌లో 3,900 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో 2,696 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో లెక్కించనున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను నిజాం కళాశాలలో లెక్కించనున్నారు. హైదరాబాదులో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్లు ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తం 588 మంది కౌంటింగ్ స్టాఫ్ ఎన్నికల ఫలితాల నాడు విధులు నిర్వహించనున్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఈ నెల 23న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం.. పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సోమవారం ట్రాఫిక్ అడిషినల్ సీపీ అనిల్‌కుమార్ యాకుత్‌పురా, చార్మినార్‌లలోని కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment