![I Have No Greed for CM Post: Jyotiraditya Scindia - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/28/scindia_0.jpg.webp?itok=Amhete_H)
భోపాల్ : తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ లేదని కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. ఏ స్థానంలో ఉన్నామనే విషయం తనకు ముఖ్యం కాదని చెప్పారు. 2018లో జరిగే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో జ్యోతిరాధిత్యను సీఎం అభ్యర్థిగా ఉండాలని తాను ప్రతిపాదిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు.
'కమల్ నాథ్ అంటే నాకు గౌరవం ఉంది. ఎవరు నాయకుడిగా ఎన్నికైనా వారికి నా నుంచి కమల్‌నాథ్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. మా పార్టీ ఐక్యంగా ఉంది. విజయం కోసం మేం అందరం కలిసి పనిచేస్తాం. ప్రత్యేకమైన స్థానం కోసం నాకేమీ పెద్దగా ఆశ లేదు' అని ఆయన చెప్పారు. మరో నేత అజయ్ సింగ్ మాట్లాడుతూ తనకు కూడా సీనియర్ నేత కమల్ నాథ్ అంటే అపార గౌరవం అని, పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకటించ మునుపే అభిప్రాయాలు ప్రకటించడం సరికాదనుకుంటున్నానని చెప్పారు. తన రాజకీయాలు గాంధీ కుటుంబంలోనే పుట్టాయని, గాంధీ కుటుంబంతోనే ముగుస్తాయని స్పష్టం చేశారు.