
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు జైపాల్‌రెడ్డి స్వయంగా ఫోన్లు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం అంటే 1985కు ముందు అసెంబ్లీకి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఢిల్లీ బాట పట్టారు.
కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వంలోనే కాకుండా యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో కీలకమైన మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. పార్లమెంట్ ఎన్నికలు లేకపోవడంతో సీనియర్లందరూ అసెంబ్లీ బరిలో ఉండాలని అధిష్టానం సూచిస్తోంది. కల్వకుర్తిలో జైపాల్‌రెడ్డికి మొదటి నుంచీ కొంత వర్గం ఉంది. గతంలో ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కొందరు స్థానిక నేతలు తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో నడిచేందుకు ససేమిరా అంటుండటంతో ‘అభ్యర్థి ఎవరనేది విడిచిపెట్టండి. మనం ఎమ్మెల్యే సీటు గెలవాలి. ఎందుకంటే సీఎం రేసులో నేనే ఉన్నా. మిమ్మల్ని నేను చూసుకుంటా’ అంటూ జైపాల్‌రెడ్డి ఫోన్లు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment