షలీన్ కబ్రా
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు తొమ్మిది దశల్లో జరుగనున్నాయి. నవంబర్ 17, 20, 24, 27, 29, డిసెంబర్ 1, 4, 8, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షలీన్ కబ్రా ఆదివారం వెల్లడించారు. 58 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. తొలి దశ ఎన్నికలకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే సర్పంచ్ ఎన్నిక ఉంటుందన్నారు. 316 బ్లాక్‌లు కలిపి మొత్తం 4490 పంచాయతీలున్నాయని, డిసెంబర్ 17న పో లింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment