panchayat elections polling
-
నెత్తురోడిన బెంగాల్.. హింసపై కేంద్రం ఆరా
పంచాయతీ ఎన్నికలు పోలింగ్‌లో చెలరేగిన ‘రాజకీయ’ హింసా.. హత్యలకు దారి తీయడంతో పశ్చిమ బెంగాల్ నెత్తురోడింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 15 మంది దాకా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే.. గంటలు గడిచే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతూ పోతోంది. మృతుల్లో అధికంగా అధికార టీఎంసీ కార్యకర్తలు, నేతలే ఉండగా.. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలూ ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ హింసపై కేంద్రం ఆరా తీసింది. ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాలంటూ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కేంద్ర బలగాలు విధులకు దూరంగా ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తుండగా.. స్థానిక పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంలో తడబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఇది బెంగాల్ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. Mamata Banerjee has reduced democracy to a joke in Bengal. In Diamond Harbour, her nephew’s LS, villagers found stamped ballot papers in Netra GP, Booth No-5. TMC captured booth last night and ‘completed’ voting. SEC is in contempt of Court orders. No security, no CCTV cameras… pic.twitter.com/52KDOTivsd — Amit Malviya (@amitmalviya) July 8, 2023 పోలింగ్ మొదలైన కాసేపటికే.. రాష్ట్రవ్యాప్తంగా 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. Not only the Ballot Boxes, in West Bengal, Democracy itself has ended up in the Gutter. pic.twitter.com/i5epumjMp6 — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 8, 2023 💥 అయితే.. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కొట్లాటలు జరిగాయి. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తుకెళ్లడం.. బ్యాలెట్ పత్రాలను దహనం చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 💥 రాణినగర్లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. 💥 డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల్లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఓట్లు వేశారని బీజేపీ ఆరోపించింది. 💥 జల్పాయ్గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్ ఆరోపించింది. Video of person running with a ballot box during West Bengal Panchayat poll goes viral pic.twitter.com/nrzKKMY9qi — Megh Updates 🚨™ (@MeghUpdates) July 8, 2023 💥 బాంబులు విసురుకోవడం, కాల్పులు.. ఇలా జరిగిన దాడుల్లో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. ‘‘ఎన్నికల వేళ దిగ్భ్రాంతికర ఘటనలు జరుగుతున్నాయి. మా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఆ కేంద్ర బలగాలు ఏమయ్యాయి?’’ అని టీఎంసీ మండిపడింది. అయితే.. #WATCH | West Bengal #PanchayatElection | Abdullah, the booth agent of an independent candidate killed in Pirgachha of North 24 Parganas district. Villagers stage a protest and demand the arrest of the accused and allege that the husband of TMC candidate Munna Bibi is behind the… pic.twitter.com/XHu1Rcpv6j — ANI (@ANI) July 8, 2023 Witness the unsettling scene unfolding in Nadia: election workers silenced by fear, people engulfed in chaos under Mamata's dictatorial policies. Democracy fades as Mamata’s rule leaves a detrimental impact on the lives of many. pic.twitter.com/lr90TgfWp5 — BJP Bengal (@BJP4Bengal) July 8, 2023 ఈ ఎన్నికల కోసం 600 కంపెనీల కేంద్ర బలగాలు.. 70 వేల మంది బెంగాల్ పోలీసులు మోహరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. Now waiting for Zubair's claim that this is not a video of Bengal panchayat election but a 6 months old video of Lohri festival in Punjab. pic.twitter.com/YvhYynpPVz — Varun Kumar Rana (@VarunKrRana) July 8, 2023 వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది. అప్పుడు హింసాత్మక ఘటనలే జరిగాయి. ఇదీ చదవండి: షిండేకు షాక్ తప్పదు ఇంకా.. బీజేపీ మాస్టర్ ప్లాన్ -
ఏపీలో ఆగిన పంచాయతీలకు పోలింగ్
సాక్షి, అమరావతి: నోటిఫికేషన్ జారీచేసిన తర్వాత ఎవరూ నామినేషన్ దాఖలు చేయక, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయిన సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. 13 పంచాయతీల సర్పంచి పదవులతో పాటు 372 పంచాయతీల పరిధిలో 723 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 13 సర్పంచి పదవులకుగాను 3 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది. 4 చోట్ల రెండోసారి కూడా సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 6 చోట్ల సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కిస్తారు. 6 సర్పంచి పదవులకు 14 మంది పోటీలో ఉన్నారు. 723 వార్డు సభ్యుల పదవులకుగాను 561 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 చోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 55 వార్డులకు సోమవారం పోలింగ్ జరగుతోంది. ఈ వార్డుల్లో 112 మంది పోటీలో ఉన్నారు. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు. -
గులాబీ జోరు
సాక్షి, మెదక్: పల్లెల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. రెండు విడతల్లో మెజార్టీ పంచాయతీలు గెలుపొందిన టీఆర్ఎస్ మూడవ విడతలోనూ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. జిల్లాలో బుధవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 133 పంచాయతీలు, 1031 వార్డుల్లో ఎన్నికలు జరగగా 90.28 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, తూప్రాన్, నార్సింగి, చేగుంట, మనోహరాబాద్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఎనిమిది మండలాల్లో మొత్తం 1,53, 354 మంది ఓటర్లు ఉండగా 1,38, 445 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 67182 మంది ఉండగా, మహిళలు 71,263 మంది ఓట్లు వేశారు. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి మెదక్ మండలంలోని మాచవరంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన స్వగ్రామం కోనాపూర్‌లో ఓటు వేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మూడవ విడతలో 133 పంచాయతీల్లో 505 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. మూడవ విడతలో ఎన్నికలు జరిగిన 133 పంచాయతీలకుగాను 108 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 15 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా చేగుంట మండలంలోని గొల్లపల్లి, జక్రంతండా, చిట్టోజిపల్లిలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు విజయం సాధించారు. కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్క సర్పంచ్ అభ్యర్థిని కూడా బరిలో దింపలేకపోయారు. దీంతో పల్లెల్లో టీడీపీ జాడ లేకుండా పోయింది. మూడు విడతల్లోనూ టీఆర్ఎస్ హవా.. జిల్లాలో మూడు విడతల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ పంచాయతీల్లో విజయం సాధించింది. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలకుగాను 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. 385 పంచాయతీలకు ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 385 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 358 పంచాయతీల్లో టీఆర్ఎస్, 73 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే మూడు పంచాయతీల్లో బీజేపీ, 35 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మొదట విడతగా 122 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 82 టీఆర్ఎస్, 28 కాంగ్రెస్, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. రెండవ విడతలో 130 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 84 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 30 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు, 16 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. బుధవారం మూడవ విడత 133 పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా 108 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు, 15 పంచాయతీల్లో కాంగ్రెస్, మూడు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మెజార్టీ పంచాయతీల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మూడవ విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో విజయోతవ్స ర్యాలీలు నిర్వహించారు. మెదక్ మండల జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యరెడ్డి స్వగ్రామం బాలానగర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు వికాస్ 23 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ మద్దతుదారు గోపాల్‌పై గెలుపొందారు. మాచవరంలో కాంగ్రెస్ మద్దతుదారు సంధ్యారాణి 165 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ బలపర్చిన రాధికపై విజయం సాధించారు. మంబోజిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభాకర్ నాలుగు ఓట్ల స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిజాంపేట మండలం చల్మెడలో నర్సింహారెడ్డి 500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నార్లపూర్ పంచాయతీలో కాంగ్రెస్ జిల్లా నేత అమరసేనారెడ్డి టీఆర్ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్‌లో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కామారంలో బీజేపీ మద్దతుదారు రాజిరెడ్డి ఓటమిపాలయ్యారు. తూప్రాన్ కోనాయిపల్లి(పిబి) గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి కంకణాల పాండు, టీఆర్ఎస్ మద్దతుదారు విఠల్‌కు 143 చొప్పున సరిసమానం ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయగా స్వతంత్ర అభ్యర్థి పాండు గెలుపొందారు. ఆదర్శ గ్రామం మల్కాపూర్‌లో ఆరుగురు పోటీ చేయగా టీఆర్ఎస్ మద్దతుదారు మన్నె మహాదేవి గెలుపొందారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లేశం గెలుపొందారు. ముప్పిరెడ్డిపల్లిలో టీఆర్ఎస్ మద్దతుదారు ప్రభావతి గెలుపొందారు. మనోహరాబాద్‌లో టీఆర్ఎస్ మద్దతుదారు చిట్కుల్ మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
కశ్మీర్లో 9 దశల్లో పంచాయతీ ఎన్నికలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పంచాయతీ ఎన్నికలు తొమ్మిది దశల్లో జరుగనున్నాయి. నవంబర్ 17, 20, 24, 27, 29, డిసెంబర్ 1, 4, 8, 11 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి షలీన్ కబ్రా ఆదివారం వెల్లడించారు. 58 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. తొలి దశ ఎన్నికలకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే సర్పంచ్ ఎన్నిక ఉంటుందన్నారు. 316 బ్లాక్‌లు కలిపి మొత్తం 4490 పంచాయతీలున్నాయని, డిసెంబర్ 17న పో లింగ్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు.