‘అద్దెకిచ్చిన ఇంటినే ఆక్రమించుకున్నావ్‌’ | Janasena Guntur MP Candidate BonaBoyina Srinivas Yadav Fires On Galla Jayadev | Sakshi
Sakshi News home page

అక‍్కడి ప్రజలు తరిమేస్తే.. ఇక్కడ రాజకీయం

Published Mon, Apr 8 2019 2:39 PM | Last Updated on Mon, Apr 8 2019 3:27 PM

Janasena Guntur MP Candidate BonaBoyina Srinivas Yadav Fires On Galla Jayadev - Sakshi

సాక్షి, గుంటూరు :  గుంటూరులో గల్లా జయదేవ్‌ తనకు అద్దెకిచ్చిన ఇంటినే బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నాడని జనసేన గుంటూరు లోక్‌సభ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌ పెద్ద భూ కబ్జాదారుడన్నారు. రాజధానిలో రాజన్న ట్రస్ట్‌ పేరుతో పది ఎకరాల భూమిని కొట్టేయడానికి జయదేవ్‌ ప్లాన్‌ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి.. ప్రైవేట్‌ కంపెనీల మధ్య గల్లా జయదేవ్‌ బ్రోకర్‌గా పని చేస్తున్నాడని విమర్శించారు.

చిత్తూరు జిల్లా ప్రజలు గల్లా కుటుంబాన్ని తన్ని తరిమేస్తే.. గుంటూరు జిల్లా వచ్చి రాజకీయం చేస్తున్నారని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాజధానిలో బీసీలపై జరిగిన దాడి ముమ్మాటికి రాజకీయ హత్యేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఓట్లు వెయ్యం అన్న పాపానికి తెలుగుదేశం నాయకులు రాజధానిలో బీసీలను కారుతో గుద్ది చంపేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును రూపుమాపడానికి జయదేవ్‌ ప్రయత్నం చేస్తున్నాడని.. దీని వెనక అతని హస్తం కూడా ఉనట్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement