వైఎస్‌ జగన్‌పై దాడి అమానుషం: పవన్‌ కల్యాణ్‌ | Janasena President Pawan Kalyan Condemns Attack On YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌పై దాడి అమానుషం: పవన్‌ కల్యాణ్‌

Published Thu, Oct 25 2018 3:50 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Janasena President Pawan Kalyan Condemns Attack On YS Jagan Mohan Reddy - Sakshi

అమరావతి : వైఎస్సార్‌సీపీ అధినేత వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం అత్యంత అమానుషమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని జనసేన తీవ్రమైనదిగా భావిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పవన్‌ పిలుపునిచ్చారు.

గాయం నుంచి జగన్‌ మోహన్‌ రెడ్డి త్వరగా కోలుకోవాలని పవన్‌ ఆకాంక్షించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కుట్రదారులను కఠినంగా శిక్షించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement