‘నరేంద్ర మోదీని జైల్లో పెడతాను’ | Javed Ahmed Rana Would Put Modi In Jail For Murdering Kashmiris | Sakshi
Sakshi News home page

సంచలన వ్యాఖ్యలు చేసిన జావేద్‌ అహ్మద్‌

Published Thu, Mar 28 2019 6:05 PM | Last Updated on Thu, Mar 28 2019 6:45 PM

Javed Ahmed Rana Would Put Modi In Jail For Murdering Kashmiris - Sakshi

కశ్మీర్‌ : సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు జావేద్‌ అహ్మద్‌ రానా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హంతకుడని, తనకు అధికారం ఉంటే ఆయన చేత ఊచలు లెక్కబెట్టించేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూంచ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన జావేద్‌ ప్రసంగిస్తూ.. మోదీ దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసి గొల్పుతున్నారు. గతంలో హిందూ, ముస్లింల మధ్య సోదర భావం ఉండేది. కానీ మోదీ దాన్ని నాశనం చేశాడు. దీని వెనక ఉన్న మరో నేరస్తురాలు మీడియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక ‘ఈ రోజు జమ్మూకశ్మీర్‌లోనే కాక దేశ వ్యాప్తంగా జరుగుతున్న మారణహోమానికి మోదీనే కారణం. నా చేతిలో గనక అధికారం ఉంటే ఈపాటికే మోదీని జైల్లో పెట్టించేవాడనం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జావేద్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మోదీని ఉద్దేశిస్తూ.. ‘మానవత్వ హంతకుడు’ అంటూ కామెంట్‌ చేశారు. మరోసారి ప్రభుత్వ సంస్థలు మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చే డబ్బులకు ఆశపడి.. రాళ్లు రువ్వేవారిని తయారు చేస్తున్నాయంటూ వ్యాఖ్యనించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement