javed ahmed
-
‘నరేంద్ర మోదీని జైల్లో పెడతాను’
కశ్మీర్ : సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు జావేద్ అహ్మద్ రానా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హంతకుడని, తనకు అధికారం ఉంటే ఆయన చేత ఊచలు లెక్కబెట్టించేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూంచ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన జావేద్ ప్రసంగిస్తూ.. మోదీ దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసి గొల్పుతున్నారు. గతంలో హిందూ, ముస్లింల మధ్య సోదర భావం ఉండేది. కానీ మోదీ దాన్ని నాశనం చేశాడు. దీని వెనక ఉన్న మరో నేరస్తురాలు మీడియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH National Conference leader, Javed Ahmed Rana, in Poonch: Khuda ki kasam, agar mera bas chale, to mai is desh ke pradhanmantri ke khilaf, jitne bhi qatl hue hain Jammu-Kashmir mein aur desh mein, mai isko qatl ke case mein andar thok dunga. (27.03.19) pic.twitter.com/o5wD5YDCzO — ANI (@ANI) March 28, 2019 అంతేకాక ‘ఈ రోజు జమ్మూకశ్మీర్లోనే కాక దేశ వ్యాప్తంగా జరుగుతున్న మారణహోమానికి మోదీనే కారణం. నా చేతిలో గనక అధికారం ఉంటే ఈపాటికే మోదీని జైల్లో పెట్టించేవాడనం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జావేద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మోదీని ఉద్దేశిస్తూ.. ‘మానవత్వ హంతకుడు’ అంటూ కామెంట్ చేశారు. మరోసారి ప్రభుత్వ సంస్థలు మోదీ, ఆర్ఎస్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడి.. రాళ్లు రువ్వేవారిని తయారు చేస్తున్నాయంటూ వ్యాఖ్యనించారు. -
గన్ పరీక్ష కోసం.. డీజీపీ సాహసం!!
-
గన్ పరీక్ష కోసం.. డీజీపీ సాహసం!!
ఆయన సాక్షాత్తు డీజీపీ. రాష్ట్రంలోని పోలీసులందరికీ అత్యున్నత అధికారి. అలాంటి వ్యక్తి.. ఓ తుపాకిని పరీక్షించడానికి తానే టార్గెట్‌గా మారారు! స్వయంగా ముందుకొచ్చి, ఆ తుపాకిని తన మీద ప్రయోగించమని చెప్పారు. ఉగ్రవాదులను హతమార్చకుండా అరెస్టు చేయాలనుకున్నప్పుడు.. వాళ్లను నిరోధించడానికి ఉపయోగపడే 'టేజర్' గన్లను సరఫరా చేసే అమెరికా కంపెనీకి చెందిన భారతీయ యూనిట్ దాన్ని ప్రదర్శించి చూపించాలనుకుంది. అందుకోసం పోలీసుల వద్దకు ఆ గన్ తీసుకొచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు కూడా తనలాంటి మనుషులే కాబట్టి దాని షాట్ తగిలితే ఏమవుతుందోనన్న భయం ఉంటుందని భావించిన డీజీపీ జావేద్ అహ్మద్.. తానే స్వయంగా ముందుకొచ్చారు. ఆ గన్‌తో తనను కాల్చమని చెప్పారు. సాధారణంగా టేజర్ గన్ షాట్ తగిలితే దిమ్మతిరిగి.. వెంటనే కింద పడిపోతారు. అయితే డీజీపీ అలా పడిపోకుండా చూసేందుకు ఆయన పక్కన ఇద్దరు పోలీసులు నిల్చున్నారు. షాట్ తగలగానే ఆయన పడిపోతుంటే పట్టుకుని జాగ్రత్తగా పడుకోబెట్టారు. లేచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట.. ''చుక్కలు కనిపించాయి''. అలా అంటూనే ఆయన నవ్వేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిస్తేనే ఇలాంటి ఆయుధాలను కొనుగోలు చేయడానికి వీలుంటుందని, అలా ఒకవేళ కొనుగోలు చేయనిస్తే.. తాము యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు వాటిని అందిస్తామని అహ్మద్ చెప్పారు. డీజీపీ ఇలా టేజర్ షాట్ తీసుకుంటున్న వీడియో, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా వ్యాపించాయి. ఐపీఎస్ అధికారుల సంఘం డీజీపీని ఆకాశానికి ఎత్తేసింది. టీజర్లు రెండు ఎలక్ట్రోడ్లను అవతలి వాళ్ల శరీరంలోకి ఫైర్ చేస్తాయి. దాంతో ఆ వ్యక్తికి విద్యుత్ షాక్ తగులుతుంది. కొద్ది సెకండ్లపాటు అచేతనంగా మిగిలిపోతారు. దాంతో వాళ్లను అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణంగా ఉగ్రవాదులు ఎక్కడైనా గదుల్లో దాక్కుని ఉన్నప్పుడు, లేదా ఎవరినైనా బందీలుగా తీసుకెళ్లినప్పుడు ఉపయోగించేందుకు తమకు ఇలాంటి ఆయుధాలు బాగా ఉపయోగపడతాయని యూపీ ఏటీఎస్ ఐజీ అసీమ్ అరుణ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత అప్పుడు వాటి కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.