![Journalist Arrested For Post Against Yogi Adityanath - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/9/delhli.jpg.webp?itok=EFmI-N6K)
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేశారని ఆరోపిస్తూ.. ఓ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో జర్నలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యోగిపై పరువుకు భంగం కలిగేవిధంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందనందుకు అతన్ని అరెస్ట్ చేసినట్లు హజరాత్‌ఘంజ్ పోలీసు అధికారులు తెలిపారు. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు పోస్ట్‌ను షేర్ చేసినందుకు ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం వారందరనీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే సీఎం యోగి తనని వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారని.. తనుకు ఆయనతో ఎప్పటి నుంచో సంబంధం ఉందంటూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతన్న వీడియోను అతను షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అతన్ని అరెస్ట్ చేశారు. యూపీలో ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిది.
Comments
Please login to add a commentAdd a comment