
సాక్షి, శ్రీకాకుళం : ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్ షాలకు పనికిమాలిన నాయకులే కావాలి తప్ప చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అంటేనే ప్రజలు తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. మోదీకన్నా సీనియర్ నేత ఒక్క చంద్రబాబు మాత్రమేనని, ఏపీ ముఖ్యమంత్రికి చాలా అనుభవం ఉందంటూ కొనియాడారు. ప్రజల మధ్య మీటింగ్స్ పెట్టి గట్టిగా మాట్లాడితే ప్రజలు తంతారనే భయం బీజేపీ నేతలకు పట్టుకుందని కళా వెంకట్రావ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment