
సాక్షి, అనంతపురం : టీడీపీ అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోంది. టీడీపీ మంత్రులు చేస్తున్న పనులకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. తాజాగా మంత్రి కాల్వ శ్రీనివాసులు దుర్భాషలాడుతూ కెమెరా కంటికి చిక్కారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద మంత్రి కాల్వ.. ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో సాక్షి విలేకరిని దూషించారు.
మంత్రి పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి వెళ్తుండగా.. ఫోటో తీసిన జర్నలిస్ట్‌ను ఏం చేస్తావ్‌రా నువ్వు.. అంటూ అసభ్య పదజాలంతో దుర్భషలాడారు. సంస్కారం లేకుండా విలేకరిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment