సాక్షి, విజయవాడ : భయం తన రక్తంలో లేదని, ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, తిరుగుబావుట ఎగరవేసిన నాని.. కొద్ది రోజులుగా సోషల్‌మీడియా వేదికగా వరుస పోస్ట్‌లతో తమ పార్టీనేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. బుధవారం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ‘నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను.’ అనే సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమను ఉద్దేశించి పెట్టినదేనని టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.
ఇక దేవినేని ఉమ ఒంటెద్దు పోకడలకు పార్టీ అధినాయకత్వం అడ్డు చెప్పలేదని ఐదేళ్ల పాటు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కేశినేని నాని ఇప్పుడు అవకాశం రావడంతో నిశబ్ద పోరాటానికి తెరలేపారు. విజయవాడ ఎంపీగా రెండవసారి ఎన్నికైనప్పటి నుంచి స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు. చంద్రబాబు ఇచ్చిన లోక్‌సభ విప్ పదవిని తిరస్కరించి తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాని టీడీపీనీ వీడి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: కేశినేని నాని తిరుగుబాటు!
తేలని కేశినేని నాని పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment