జగన్‌ అజెండా సెట్‌ చేస్తే..చంద్రబాబు రియాక్షన్‌.. | Killi Krupa Rani joins YSRCP in presence of YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన కిల్లి కృపారాణి

Published Thu, Feb 28 2019 12:21 PM | Last Updated on Thu, Feb 28 2019 2:57 PM

Killi Krupa Rani joins YSRCP in presence of  YS Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ మహిళా నేత కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆమె గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశం అయ్యారు. అనంతరం వైఎస్‌ జగన్‌... కిల్లి కృపారాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడుతూ...‘నిబద్ధత ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌. రాటుదేలిన రాజకీయ నాయకుడు వైఎస్‌ జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై వైఎస్‌ జగన్‌ ఓ అజెండా సెట్‌ చేస్తున్నారు. చంద్రబాబు దానికి రియాక్ట్‌ అవుతున్నారు. అజెండాను సెట్‌ చేసే వారే నాయకుడు అవుతారు. 

ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉండటానికి కారణం వైఎస్‌ జగన్‌. వైఎస్సార్ సీపీ పోరాటాల వల్లే ఇప్పటికీ హోదా సజీవంగా ఉంది. చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే యూపీఏలో ఎందుకు చేరలేదు?. చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు పప్పుఉ బెల్లంలా ఏదో ఇస్తున్నారు. డబ్బుతో ఓటర్లను చంద్రబాబు కొనాలనుకుంటున్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. హోదాను మోదీ కాళ్ల కింద తాకట్టు పెట్టారు. సంతలో పశువుల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’  అని అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement