సాక్షి, విజయవాడ : తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్ర రాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామిని కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకున్నట్టు తెలిపారు. ఎన్‌ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నట్టు వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా మనపై జరుగుతున్న దాడులపై కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటాన్నామని అన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌ను కూడా ఎన్‌ఐఏ పరిధిలో తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ మూడు బిల్లులను సోమవారం పార్లమెంట్‌లో హోం శాఖ ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు.
అంతకు ముందు అమ్మవారి దర్శనానికి వచ్చిన కిషన్‌రెడ్డికి మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రాలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు కిషన్‌రెడ్డి వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment