
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు, సీట్లన్నీ బలుపుకాదు వాపేనని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన ఓట్లు కూడా రావన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమన్నారు. ఈ గెలుపును తక్కువ చేసి చూపించడానికి మేధావులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీపై గుడ్డి వ్యతిరేకతతో గుజరాత్ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కొందరు అవహేళన చేసేవిధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు బీజేపీని ఆదరించినా ఇంకా జీఎస్టీ, నోట్లరద్దు.. అంటూ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. బుధవారం నుంచి రెండురోజులపాటు రాష్ట్ర పార్టీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల కోసం రూట్‌మ్యాప్ తయారు చేస్తామని వెల్లడించారు. నిన్నటిదాకా ప్రధాని మోదీని పొగిడిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరగానే సిద్ధాంతాలు అంటూ మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment