'వైఎస్సార్‌ కోసం మంత్రి పదవిని వదులుకున్నాం’ | konda murali slams errabelli dayakar rao | Sakshi
Sakshi News home page

'వైఎస్సార్‌ కోసం మంత్రి పదవిని వదులుకున్నాం’

Published Wed, Oct 25 2017 3:22 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

konda murali slams errabelli dayakar rao - Sakshi

సాక్షి, వరంగల్‌ : పదవుల కోసమే రాజకీయాల్లో లేమని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కోసం మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర కొండా కుటుంబానికి ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. వరంగల్‌ 14వ డివిజన్ తిలక్ రోడ్డులో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కొండా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీలో కొన్ని ఎర్ర బల్లులు (ఎర్రబెల్లి దయాకర్ రావు) తయారై, వచ్చే ఎన్నికల్లో వరంగల్ నుంచి కొండా సురేఖ పోటీ చేయదన్న ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కొండా మురళికి ప్రాణం ఉన్నంత వరకు సురేఖ పోటీలో ఉంటుందని తెలిపారు. తన కూతురు సుస్మిత భవిష్యత్తు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ పునర్జన్మ ఇచ్చిందని,  అలాంటి పార్టీని వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.. ఎర్రబెల్లి కుటుంబంతో 30 సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందన్నారు. మముల్ని అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ తాము పైకి ఎదుగుతున్నామని చెప్పారు. ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తూ, రాబోయే రోజుల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారం చేసుకుంటూ, తమపై బురద చల్లడం సబబు కాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement