మార్పునకు సంకేతం | Latest poll wins show Congress on comeback trail, says Jaipal Reddy | Sakshi
Sakshi News home page

మార్పునకు సంకేతం

Published Mon, Oct 16 2017 7:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Jaipal Reddy.jpg - Sakshi

హైదరాబాద్‌: ప్రజాదరణతో కాంగ్రెస్‌ పునర్‌వైభవం సంపాదించుకుంటుండగా, అధికార బీజేపీ పతనం దిశగా పయనిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ జైపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవలి గుర్‌దాస్‌పూర్‌, వెంగరలో జరిగిన ఉప ఎన్నికలు, నాందేడ్‌-వాఘాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గుర్‌దాస్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తమ పార్టీ ఘన విజయం దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమన్నారు. ఈ ఎన్నికలో పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సునీల్‌ జాఖర్‌ దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదేవిధంగా కేరళలోని వెంగరలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ బలపరిచిన ఐయూఎంఎల్‌ అభ్యర్థి గెలుపుసాధించారన్నారు. ఈ విజయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని చెప్పారు. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం అధికార ఎన్డీఏ పక్షానికి శరాఘాతం వంటిదని పేర్కొన్నారు. ఇదే ఒరవడి హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement