వైఎస్సార్ సీపీ
1.పులివెందుల: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పేరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
పుట్టిన తేదీ : 21.12.1972
విద్యార్హత : ఎంబీఏ
స్వస్థలం : పులివెందుల
తల్లిదండ్రులు : వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ విజయమ్మ
భార్య: వైఎస్ భారతిరెడ్డి
సంతానం: హర్ష, వర్ష
రాజకీయ ప్రవేశం
2009లో కాంగ్రెస్‌పార్టీ తరపున కడప ఎంపీగా విజయం. ఆ తర్వాత తన తండ్రి వైఎస్సార్ మరణించడంతో కాంగ్రెస్‌పార్టీ అధిష్టానంతో విభేదాల కారణంగా తన ఎంపీ పదవికి, కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వానికి 2010 నవంబర్ 10న రాజీనామా చేశారు. 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మే నెలలో జరిగిన ఉప ఎన్నికలలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి 5,45,672 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నారు.
2.ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాదరెడ్డి
పేరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి
పుట్టిన తేదీ : 2–12–1966
తల్లిదండ్రులు:
రాచమల్లు శివశంకర్‌రెడ్డి,
మునిరత్నమ్మ
విద్యార్హత: బి.ఏ
నివాసం: ప్రొద్దుటూరు
భార్య: రాచమల్లు రమాదేవి
సంతానం: పల్లవి
(పీజీ జర్నలిజం), కృష్ణ కావ్య
(ఆస్ట్రేలియాలో ఎంబీఏ)
రాజకీయ ప్రవేశం
1998లో మున్సిపల్ కౌన్సిలర్, 2003లో మున్సిపల్ వైస్ చైర్మన్, 2004 సెప్టెంబర్ నుంచి 2005 మార్చి 5వ తేదీ వరకు మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్, 2014 ఎన్నికల్లో తొలిమారు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
3.జమ్మలమడుగు: డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి
పేరు : డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 12–3–1981
విద్యార్హత : ఎంబీబీఎస్, డీఏ(అనస్థీషియా)
తల్లిదండ్రులు : వెంకటసుబ్బారెడ్డి,
లక్ష్మీదేవమ్మ
స్వస్థలం : నిడుజివ్వి, ఎర్రగుంట్ల మండలం
భార్య : క్రాంతి ప్రియ
సంతానం : దిహాంతిక రెడ్డి(కుమార్తె)
రాజకీయ ప్రవేశం: 2019 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
4.రైల్వేకోడూరు : కొరముట్ల శ్రీనివాసులు
పేరు : కొరముట్ల శ్రీనివాసులు
పుట్టిన తేదీ : 06–07– 1971
విద్యార్హత : ఎంఏ, ఎంఎల్
తల్లిదండ్రులు: గంగయ్య, తులశమ్మ
స్వస్థలం : రెడ్డివారిపల్లె, రైల్వేకోడూరు మండలం
భార్య : స్వర్ణకుమారి
సంతానం : పునీత్‌రాయ్, రాజశేఖర్.
రాజకీయ ప్రవేశం: 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా, 2012 ఉప
ఎన్నికలు, 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ
తరపున గెలుపొందారు.
5.మైదుకూరు : శెట్టిపల్లె రఘురామిరెడ్డి
పేరు : శెట్టిపల్లె రఘురామిరెడ్డి
పుట్టిన తేదీ : 20–06–1946
విద్యార్హత : పీయూసీ
తల్లిదండ్రులు : శెట్టిపల్లె సుబ్బమ్మ,
చిన్న నాగిరెడ్డి
జన్మస్థలం : నక్కలదిన్నె గ్రామం, చాపాడు మండలం.
భార్య : ప్రభావతమ్మ
సంతానం : ముగ్గురు కుమారులు నాగిరెడ్డి, అశోక్‌రెడ్డి, దుశ్యంత్‌రెడ్డి, కుమార్తె సుధా
రాజకీయ ప్రవేశం:
1982లో ప్రొద్దుటూరు సమితి అధ్యక్షునిగా, 1985లో శాసనసభ మధ్యంతర ఎన్నికలో మైదుకూరు ఎమ్మెల్యేగా (టీడీపీ) గెలుపొందారు. తిరిగి 1999లో ఎమ్మెల్యేగా (టీడీపీ), 2014లో ఎమ్మెల్యేగా (వైఎస్సార్‌సీపీ) గెలుపొందారు.
6.రాయచోటి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
పేరు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
పుట్టిన తేదీ : 15–06–1973
తల్లిదండ్రులు: శ్రీమతి కృష్ణమ్మ, గడికోట మోహన్‌రెడ్డి(మాజీ ఎమ్మెల్యే)
విద్యార్హత : బి.టెక్
భార్య: శివలలిత
సంతానం: కుమారుడు: రిత్విక్‌రెడ్డి, కుమార్తె: షాహనారెడ్డి
స్వస్థలం : యర్రంరెడ్డిగారిపల్లె, సుద్దమల గ్రామం, రామాపురం మండలం
రాజకీయ ప్రవేశం:
2009లో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రెండోసారి 2012 ఉప ఎన్నికల్లో, మూడోసారి 2014 ఎన్నికల్లో గెలుపొందారు.
7.బద్వేలు: డాక్టర్ గుంతోటి
పేరు: డాక్టర్ గుంతోటి
వెంకట సుబ్బయ్య
పుట్టిన తేదీ: 10–01–1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య,
పెంచలకొండమ్మ
విద్యార్హత: ఎంబీబీఎస్, ఎంఎస్ (ఆర్థో)
స్వస్థలం: వల్లెలవారిపల్లె, గోపవరం మండలం
భార్య: సంధ్య, ఎంబీబీఎస్, డీజీఓ
సంతానం: కుమార్తె: హేమలత, ఎంబీబీఎస్ ద్వితీయ
సంవత్సరం, ప్రభుత్వ మెడికల్ కళాశాల,
కుమారుడు: తనయ్ పదో తరగతి
రాజకీయ ప్రవేశం: 2014 నుంచి వైఎస్సార్‌సీపీలో
క్రియాశీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
8.కడప: షేక్. బేపారి
పేరు: షేక్. బేపారి
అంజద్ బాషా
పుట్టిన తేదీ: 12–08–1971
విదార్హత: బి.ఏ
స్వస్థలం: కడప
తల్లిదండ్రులు: షేక్. బేపారి అబ్దుల్ ఖాదర్, ఎస్‌బి
నూర్జహాన్ బేగం
భార్య: ఎస్‌బి నౌరిన్ ఫాతిమా
సంతానం: జైబా జువేరియా (కుమార్తె)
రాజకీయ ప్రవేశం:
2005లో మున్సిపల్ కార్పొరేటర్, 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
9.కమలాపురం:పోచిమరెడ్డి
పేరు: పోచిమరెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి
పుట్టిన తేదీ: 20–08–1958
విద్యార్హత: బి.కాం
తల్లిదండ్రులు: పి.రామాంజులరెడ్డి, తులసమ్మ
స్వస్థలం: పోచిమరెడ్డిపల్లె,
వీరపునాయునిపల్లె మండలం
భార్య: అరుణమ్మ
సంతానం: రమ్యతారెడ్డి( కుమార్తె), నరేన్‌రెడ్డి (కుమారుడు)
రాజకీయ ప్రవేశం: 1999లో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా, 2004లో కడప నగర తొలి మేయర్‌గా, 2014లో కమలాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
10.రాజంపేట: మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
పేరు : మేడా వెంకట మల్లికార్జునరెడ్డి
పుట్టిన తేదీ: 26.01.1963
తల్లిదండ్రులు: మేడా రామకృష్ణారెడ్డి,
లక్ష్మినరసమ్మ
స్వస్థలం: చెన్నయ్యగారిపల్లె,
నందలూరు మండలం
విద్యార్హత: బీఎస్సీ
భార్య: మేడా సుచరిత
సంతానం: మేడా వెంకటరామిరెడ్డి, మేడా కృష్ణతేజారెడ్డి
రాజకీయ ప్రవేశం: 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment