సాక్షి, బీహార్ : కేంద్రంలోని ఎన్డీయేలో లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్‌లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్‌లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్‌లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్‌జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్‌లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment