Ram vilaspaswan
-
అక్కడ మాత్రమే బీజేపీతో దోస్తీ !
సాక్షి, బీహార్ : కేంద్రంలోని ఎన్డీయేలో లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
రేషన్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: పేదలకు సబ్సిడీ ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే "ప్రజాపంపిణీ వ్యవస్థ’’ (పీడీఎస్) ధరలను పెంచబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆహార ధాన్యాల ధరల పెంపు మరో ఏడాది పాటు ఉండదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ఆహార శాఖామంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు ఇతర తృణధాన్యాల విక్రయ ధరలను ఒక సంవత్సరం వరకు పెంచమని రాం విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తద్వారా ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2013 లో ఆమోదం పొందిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద మూడు సంవత్సరాలకు ఆహారధాన్యాల ధరలను సమీక్షిస్తారు. PM Sh. Narendra Modi Ji has taken a historic decision to not to increase the issue prices of food-grains under NFSA for one more year. — Ram Vilas Paswan (@irvpaswan) June 28, 2017