
న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎన్నికల ఫలితాల ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. జనం మరోసారి నరేంద్రమోదీకి పట్టం కట్టినట్టు కౌంటింగ్ ఎర్లీ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. తిరుగులేని మెజారిటీతో సొంతంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ ఫలితాల సరళి చాటుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుతున్న కౌంటింగ్ ట్రెండ్స్‌ను బట్టి ఎన్డీయే 321 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇతర పార్టీలు 111 స్థానాలతో రెండో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి నమో మంత్రం పనిచేసినట్టు కనిపిస్తుండగా.. ఈసారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం, ప్రభావం, ఆయన సోదరి ప్రియాంక గాంధీ ప్రచారమూ పెద్దగా పనిచేయనట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment