భోపాల్: ఎప్పుడూ శాంతంగా కనిపించే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ అనూహ్యంగా ఓ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించాడు. అదీ బహిరంగంగా అందరూ చూస్తుండగానే. ధార్ జిల్లా సర్దార్‌పూర్‌లో రోడ్‌షోలో ఈ ఘటన జరిగింది. రోడ్‌షోలో భాగంగా సీఎం చౌహాన్ ప్రజలతో కలిసి నడుస్తున్న సందర్భంలో తన సమీపంగా వచ్చిన ఓ వ్యక్తిని చెంప ఛెళ్లుమనిపించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కంది. ప్రజల రద్దీ నడుమ పలువురు సీఎం చౌహాన్ ను దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటుండగా ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణం ఏమిటి? సీఎం ఎందుకు ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు? అన్న వివరాలు తెలియరాలేదు.
మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శివ్‌రాజ్ చౌహాన్ ఈ ర్యాలీ నిర్వహించాడు. ఈ నెల 17న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 20న ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశమున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ‘సెమీఫైనల్’గా భావిస్తుండటంతో బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఐదు జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, నగర కౌన్సిల్లు, 51 గ్రామపంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment