భోపాల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తుతున్న వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిదీర్‌సింగ్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇవి రెండింటికి ముడిపెట్టి చూడవద్దని, వేర్వేరుగా చూడాలని ఆయన సూచించారు.
పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్‌లో వివక్షకు గురవుతున్న మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడంలో తప్పేమీలేదని అన్నారు. ఆయా దేశాల్లో మన సొంత సోదరులు ఉండి ఉంటే ఇలాగే వ్యతిరేకిస్తామా అని ప్రశ్నించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా.. హరిదీర్ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటనపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment