కోల్‌కత : కేంద్రంలో మోదీ పాలనలాగే బెంగాల్‌లో దీదీ పాలన ఉందంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎదురుదాడి చేశారు. ‘రాహుల్ చేసిన కామెంట్లను నేను పట్టించుకోను. అతనొక బచ్చా. అంతకంటే ఇక ఏం మాట్లాడను’ అని వ్యాఖ్యానించారు. అన్నీ కుదిరి జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పుంజుకుంటే ప్రధాని రేసులో ఉండే రాహుల్‌ను ఆమె బచ్చాగా పేర్కొన్నారు. ఇక బీజేపీ శ్రేణులు సైతం ఆయనను ‘పప్పూ’ అని అభివర్ణించడం తెలిసిన సంగతే.
గత శనివారం మాల్దా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ‘మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గత కమ్యూనిస్టుల పాలనకు టీఎంసీ పాలనకు తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో మార్పేమీ లేదు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మమత పాలన అధ్వానం. ఆమెకు మినహా మరొకరు బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీల అమలులో మమత విఫలమయ్యారు’ అంటూ విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ఒకలా రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి మరోలా వ్యవహరిస్తారని మమత తీరుపై చురుకలంటించారు. ప్రధాని మోదీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు.
(చదవండి : మమతపై రాహుల్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment