సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ బహిష్కృత నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాంచారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. ‘దేశానికి గౌరవం తీసుకొస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నిజాం 8వ వారసుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా కొనసాగుతున్నారు. వ్యవస్థ పట్ల కేసీఆర్ ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు. ప్రజాస్వామ్యకి విరుద్దoగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రంలో చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కేసీఆర్ నెరవేర్చడం లేదు. ప్రజలు త్వరలో కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు’ అని అన్నారు.
మోత్కుపల్లి చేరిక తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని తాము ఆశిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘ ఎన్టీఆర్ హయాంలో కూడా మోత్కుపల్లి పనిచేసారు.దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి. బీజేపీ చేస్తున్న అభివృద్ధి ,తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షణీయ అయ్యి మోత్కుపల్లి బీజేపీ లోకి చేరారు పార్టీలో ఒక సైనికులు గా పనిచేస్తా అని పార్టీ లోకి చేరారు. . కేసీఆర్ అవలంస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల అమిత్ షా కి వివరించాము. సమ్మక్క సారక్క పండగకి కేంద్ర మంత్రులు ను ఆహ్వానించాం’ అని తెలిపారు.
నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మోత్కుపల్లి
Published Tue, Jan 7 2020 6:23 PM | Last Updated on Tue, Jan 7 2020 6:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment