సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది. దళితులపై దాడులకు నిరసనగా సంఘం అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద ధర్నా చేపట్టింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీంకోర్టు ద్వారా కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. చట్టంలోని నిబంధనలను సడలిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులున్నాయని ఆరోపించారు. చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీజేపీ మానుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment