మాదిగల ద్రోహి చంద్రబాబు | MRPS Leader Bramhayya fires on AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

మాదిగల ద్రోహి చంద్రబాబు

Published Wed, May 20 2015 7:04 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

MRPS Leader Bramhayya fires on AP CM Chandrababu

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాదిగల ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ధ్వజమెత్తారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్‌లో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు దోబూచులాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు మాదిగల ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిచెబుతారని హెచ్చరించారు. జూన్ 14వ తేదీన లక్షమందితో నెల్లూరులో పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ మహాసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement