MRPS meeting
-
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారు..
సాక్షి, మఠంపల్లి : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా మంజీనాయక్, జెడ్పీటీసీ నీలామంజీనాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు రాజారెడ్డి, మాజీ ఎంపీపీ టి.అప్పయ్య, నాయకులు వంటిపులి శ్రీనివాస్, స్రవంతికిషోర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సోములుగౌడ్, వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, అచ్చమ్మ ఉన్నారు. ఉత్తమ్ గెలుపునకు ఎమ్మార్పీఎస్ కృషి హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపునకు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ సంఘం ఇన్చార్జ్ బాలచంద్రు మాదిగ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆ«ధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు ప్రసాద్‌మాదిగ, ప్రభు, బాబుమాదిగ తదితరులున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలి.. హుజూర్నగర్ : నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శనివారం పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజాకూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు పాలకూరి బా బు, రాములు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపే.. పాలకవీడు : అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపును కోరుకుంటున్నారని కాంగ్రెస్ మండల సీనియర్ నాయకుడు భూక్యా గోపాల్ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని నర్లంగులగూడెం, గుండ్లపహాడ్ గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది ఉత్తమ్ సమక్షంలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్. శ్రీనివాసరెడ్డి, ఎస్.నాగిరెడ్డి, వల్లబురెడ్డి, జ్యోతి, సంధ్య, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నేరేడుచర్ల : రానున్న ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు. నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న యూత్ నాయకులు -
చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే సహించం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ హెచ్చరించింది. దళితులపై దాడులకు నిరసనగా సంఘం అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీంకోర్టు ద్వారా కుట్రలు పన్నుతోందని పేర్కొన్నారు. చట్టంలోని నిబంధనలను సడలిస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులున్నాయని ఆరోపించారు. చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీజేపీ మానుకోవాలని, లేదంటే భవిష్యత్తులో ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
వర్గీకరణ జరిగేదాకా పోరాటం ఆగదు
షాద్‌నగర్‌రూరల్ : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టి చట్టబద్దత కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఎమ్మార్పీస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగటి సత్యం అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాగటి సత్యం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో పెట్టడానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదింపజేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని కలిసి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. అధికారంలోనికి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పిన బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వర్గీకరణ విషయమై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలు హాజరైనా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరుకాకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోకుంటే సీపీఐ పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి నాయకత్వంలో అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీకి బయలుదేరే పనిలో ఉన్నామన్నారు. వర్గీకరణ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఫిబ్రవరి 7న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్ నాయకత్వాన్ని కేంద్ర, రాష్ట్రాలపై యుద్ధానికి సమాయత్తం చేయడానికి జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఫిబ్రవరి 1న షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేవానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఫిబ్రవరి 12, 13న హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కార్యనిర్వాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీస్ నాయకులు వనం నర్సింహ, మద్దిలేటి, శంకర్ రావు, బుర్రా రాంచంద్రయ్య, కట్ట జగన్, నర్సయ్య, చిన్నోళ్ల అనంతయ్య, జోగు మల్లేష్, పెంటనోళ్ల నర్సింలు, శ్రవణ్ కుమార్, జోగు శివరాములు, పాండు, యాదగిరి, రవి, రాజు, సురేష్ పాల్గొన్నారు. -
చంద్రబాబుకు గుణపాఠం చెబుతాం: వంగపల్లి
నేడు విజయవాడలో తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సదస్సు ముషీరాబాద్ : ఎస్సీ వర్గీకరణను చేస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం కూడా చేయకుండా మాదిగలను వంచించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని, చంద్రబాబుకు సహకరించిన మందకృష్ణ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయ కర్త వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ హెచ్చరించారు. విద్యానగర్‌లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కు అడ్డుగా ఉన్న అన్ని శక్తులను ఎదుర్కోనేందుకు టీఎంఆర్పీఎస్ సమాయత్తమవతోందన్నారు. చంద్రబాబు, మందకృష్ణలకు బుద్ధి చెప్పేందుకు తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈనెల 21న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. సమావేశంలో చిలుక ప్రభాకర్ మాదిగ, జి.శ్యాంరావు మాదిగ, ఆర్.కృష్ణమాదిగ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాదిగల ద్రోహి చంద్రబాబు
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాదిగల ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ధ్వజమెత్తారు. నెల్లూరులోని అంబేడ్కర్ భవన్లో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు దోబూచులాట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు మాదిగల ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధిచెబుతారని హెచ్చరించారు. జూన్ 14వ తేదీన లక్షమందితో నెల్లూరులో పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ మహాసభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.