సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగంతో పాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు జి.వి. సూర్యకిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్‌లోకి సూర్యకిరణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ల చేరికల కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియాతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment