సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయపాలైన విపక్షాలకు ఫలితాల అనంతరం కూడా వరుస షాకులు తగులుతున్నాయి. అనేక మంది కీలక నేతలు బీజేపీకి గూటికి చేరుతున్నారు. తాజాగా కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షా పార్టీలకు మరో షాక్ తగిలింది. ఎస్సీపీ ఎంపీ, ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్‌రాజ్ భోంస్లే బీజేపీలో చేరారు. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశ అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినైతానని తెలిపారు.
కాగా ఆయన రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేతలు ఇలా పార్టీని వీడటం నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరి కంటే సంపన్నుడిగా ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే నిలిచిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున సతారా నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ఆయన.. తనకు రూ.199 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.185.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.13.38కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేరిట రూ.89 లక్షల డిపాజిట్, రూ.1.45 కోట్ల మేర షేర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment