సాక్షి, శ్రీకాకుళం : 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తున్నారని, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ ఇలా రెండు పార్టీలతో జతకలిసిన ఆయన.. మేము వాళ్లతో కలుస్తామని, వీళ్లతో కలుస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలతో మమేకమవుతూ.. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అదే సమయంలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు.
‘2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నరేంద్రమోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతోనూ జతకట్టిన చంద్రబాబు.. ‘వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు’ అని మాపై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు. కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment