sakshi tv interview
-
పేర్ని నానితో స్ట్రయిట్ టాక్: మా బందరు ప్రజల చిరకాల కల నెరవేర్చారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చేసినా పబ్లిసిటీ చేసుకోరని, చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసమే పుట్టారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బందరు పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని, 24 నెలల్లోనే పోర్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. సీఎం జగన్ మా బందరు ప్రజల చిరకాల కల నెరవేర్చారని, నా జీవితంలో ఈ పోర్టు నిర్మాణం చాలా సంతృప్తి నిచ్చిందన్నారు. చంద్రబాబు శిలాఫలకం మాత్రమే వేస్తే, టీడీపీ నేతలు పోర్టు నిర్మాణం చూసి మాట్లాడాలన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు ఒక్క సీఎం జగన్ హయాంలోనే నిర్మిస్తున్నారని, చంద్రబాబు ఒక్క కియా తెస్తే సీఎం జగన్ అనేక పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. రామోజీకి కులపిచ్చి పెరిగిపోయి ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని, తన కులం వ్యక్తి చంద్రబాబు సీఎం అవ్వాలని నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేని అభివృద్ధి సీఎం జగన్ చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడైనా సీఎం జగన్‌లా సంస్కరణలు తీసుకొచ్చారా?, చంద్రబాబు సినిమా అయిపోయిందని, అందుకే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. టీడీపీలో అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు మార్చలేదా?, చంద్రబాబు చంద్రగిరిలో ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. జగన్ కోసమే పనిచేసే ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో ఉంటారని, అవసరాల కోసం వచ్చే వారు పార్టీ మారినా నష్టం లేదన్నారు. సీఎం అయ్యే సీన్ లేదని పవనే చెప్పారని, పవన్‌కు అర్హత లేదని లోకేష్ నిజం చెప్పాడన్నారు. లోకేష్ రెడ్ బుక్ కోసం పాదయాత్ర చేశారా..? , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోవడం మంచిదైందని, లేదంటే బాబుకు అమ్ముడుపోయి మమ్మల్ని విమర్శించేవారన్నారు. మాజీ మంత్రి పేర్ని నానితో సాక్షి స్ట్రయిట్ టాక్ ఆదివారం గంరాత్రి 7.30 ని.లకు,తిరిగి సోమవారం మధ్యాహ్నం గం. 12.30 ని.లకు సాక్షి టీవీలో ప్రసారమవుతుంది. -
తేజ్ చిలిపిగా సంయుక్త ని ఎలా ఏడిపిస్తునాడో చుడండి
-
ఆక్సిడెంట్ నుండి షూటింగ్ కి వెళ్లినపుడు!
-
వారాహి ఎందుకాగింది.. వర్మ ఏమంటాడో?
రాంగోపాల్ వర్మ ఉరఫ్ ఆర్జీవీ.. ఈ పేరు వినగానే వివాదాలు కళ్ల ముందు మెదులుతాయి. విమర్శలూ గుర్తుకొస్తాయి. యువత మధ్య ఆయన అనుభవించే వ్యక్తిగత స్వేచ్ఛా అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది. పరిణామం ఎలాంటిదైనా.. ఆ క్రమంలో ఏం జరిగినా.. పాపులారిటీలో మళ్లీ రాంగోపాల్ వర్మనే ఎప్పుడూ ముందుంటారు. తన అభిప్రాయాన్ని సూటిగా, ఎలాంటి బేషజాలు లేకుండా నిర్మోహమాటంగా చెప్పేస్తాడు వర్మ. మరీ ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలపై ఆర్జీవీ ఏం చెబుతారు?. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు ఆగింది?. వారాహిని ఏ ఉద్దేశ్యంతో ఎవరు ఆపుతున్నారు?. లోకేష్ యాత్ర ఫెయిల్ అయింది కాబట్టి వారాహికి బ్రేక్ లు పడుతున్నాయా? దత్తపుత్రుడు అనే టైటిల్ సార్థకం అవుతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ వర్మ మార్క్ సమాధాలు.. ఫ్రాంక్లీ విత్ RGV కార్యక్రమంలో చూడండి. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీ సాక్షి టీవీలో చూడండి. మిస్ కావొద్దు. -
పేర్ని నాని స్ట్రయిట్ టాక్: బండి కొన్నంత మాత్రాన యుద్ధం చేసేసినట్టా?
చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు మళ్లీ ఓటేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గత ఎన్నికల ముందు ప్రధాన మంత్రి మోదీని దారుణంగా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీతో స్నేహం కోసం మూడున్నరేళ్లుగా నానా పాట్లు పడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, ఆయన బండి కొన్నంత మాత్రాన యుద్ధం చేసేసినట్టా అని పేర్నినాని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే 2019లో ఎలాగైతే నోట్లో వేలుపెట్టుకుని చూశాడో 2024లో కూడా అలానే పవన్ చూస్తాడని, జగన్‌ని మాత్రం ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానితో స్ట్రయిట్ టాక్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 11.30 గంటలకు సాక్షి టీవీలో ప్రసారం అవుతుంది. -
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ " స్ట్రెయిట్ టాక్ "
-
'సరిగమప' : శ్రీముఖి కోసం చరణ్.. డేనియల్‌పై పార్వతి సెటైర్లు
బుల్లితెరపై జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ దుమ్మురేపుతున్న ఈ షో ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సరిగమప గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం 8మంది సింగర్స్ ప్రణవ్, పార్వతి, అభినవ్, శృతిక, సుదాన్షు, డేనియల్, చరణ్, శివాణి టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సందర్భంగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫైనలిస్టులతో సాక్షి టీవీ సరదాగా ముచ్చటించింది. షోకి సంబంధించిన విషయాలతో పాటు సరదా కబుర్లతో ఈ చిట్‌చాట్ సాగింది. ముఖ్యంగా డేనియల్‌పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక శ్రీముఖి కోసం చరణ్ ఓ లవ్లీ సాంగ్‌ను డెడికేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ సింగర్స్ సరదా మూమెంట్స్ చూసేయండి. -
ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య
యంగ్ హీరో నిఖిల్ ఏడాది క్రితం తన ప్రేయసి పల్లవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత లాక్డౌన్ 2020 డిసెంబర్లో నిఖిల్-పల్లవిల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిఖిల్-పల్లవిలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు నిఖిల్. చదవండి: మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్ ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) వాలంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్య, డాక్టర్ పల్లవితో కలిసి తొలిసారి మీడియాకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఈ లవ్లీ కపుల్స్ సాక్షి టీవీతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ డాక్టర్-యాక్టర్ మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైందో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. -
సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: కార్తికేయ భార్య
దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, తన స్నేహితురాలు, సింగర్, జగపతి బాబు బంధువైన పూజను ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ 28 జైపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవం జరిగింది. వారి వివాహం జరిగి రెండేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా ఈ జంట సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారి ప్రేమ, పెళ్లి పరిచయం గురించి ఏం చెప్పారో వారి మాటల్లోనే విందాం రండి. కార్తికేయ మాట్లాడుతూ.. ఏడాది ఫ్రెండ్షిప్ తర్వాత పూజకు ప్రపోజ్ చేశా. కొన్ని నెలల తర్వాత ఓకే చేసింది. ఆమె పాట నాకు ఇష్టం.. కావాలన్నప్పుడల్లా నా కోసం పాడతుంది. ⇔ కాలేజ్ డేస్‌లో సొంత జీతం అనే కిక్‌ని ఎంజాయ్ చేయడం కోసం ఐస్‌క్రీమ్ పార్లర్లో పని చేశాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ చూశా. ఇప్పుడు మార్కెటింగ్ చూస్తున్నాను. ⇔ నేను వింటర్ వెడ్డింగ్ కావాలనుకున్నాను. నాకు చలి ఇష్టం.. తనకు (పూజకి) కష్టం. జైపూర్ ప్యాలెస్‌లో డిసెంబరు 28 మా పెళ్లి ముహూర్తం రావడం లక్కీ. 15 ఏళ్లలో కోల్డెస్ట్ 10 డిగ్రీల చలిలో మా పెళ్లయింది. మ్యారేజ్ అంటే... సెక్యూరిటీ, అండర్స్టాండింగ్, ట్రస్ట్, లవ్. ⇔ చాలామంది నమ్మరు కానీ బాబా (రాజమౌళి).. టీ, కాఫీ పాలు సహా ఏమీ తాగరు. పెరుగన్నంలో మాత్రం తప్పకుండా స్వీట్ ఉండాల్సిందే. పెరుగు వేసుకుంటుండగానే స్వీట్ ఏది అని అడుగుతారు రాజమౌళి. రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు. సినిమా వాళ్లతో పెళ్లొద్దనుకున్నా!: పూజ ⇔ చిన్నప్పటి నుంచీ సినిమా ఫీల్డ్ వాళ్లని పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. అందుకే కార్తికేయ అడగ్గానే, ఆలోచించా. ఆ తర్వాత ఒప్పుకున్నా. తను ప్రతి విషయంలో నా వైపే ఉంటాడు. హైపర్ యాక్టివ్, ఓర్పుకి కేరాఫ్.. ప్రేమించిన వారి కోసం ఏమైనా సరే చేస్తాడు. ⇔ సంప్రదాయ సంగీతం నేర్చుకున్నాను. ప్రాక్టీస్ తప్పింది కాబట్టి మళ్లీ సాధన పెంచుకుని సినిమాలకి పాడతానేమో తెలియదు. కానీ నటించడం అంటే కష్టమే... కెమెరా ముందు నెర్వస్ అయిపోతా. మీకీ ఇంటర్వ్యూ ఇవ్వడానికే కష్టమైంది. ⇔ పెళ్లికి ముంతు.. తర్వాత కూడా చుట్టూ ఉన్న శక్తివంత మైన మహిళల నుంచి చాలా నేర్చుకుంటున్నాను. అమ్మ దగ్గర క్రమశిక్షణ, హార్డ్ వర్క్.. ఎవరిపైనా ఏ నెగటివ్ ఫీల్ ఉంచుకోకపోవడం అత్తయ్య (రమా రాజమౌళి) దగ్గర, పిల్లల్ని చూసుకోవడం ఎలా అనేది వల్లీ పిన్ని దగ్గర... ఇలా... ⇔ మా పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా రాజమౌళిగారు అలానే ఉన్నారు. పదేళ్ల తర్వాత కూడా ఆయనలో మార్పు చూడలేనేమో... ⇔ జగపతి బాబాయ్‌కి చిన్నప్పటి నుంచీ నన్ను అమ్మ దగ్గర నుంచి సేవ్ చేయడమే పని.. ⇔ ట్యాంగిల్ ఆర్ట్ అనే ఆర్ట్ ఫార్మ్ ఉంది. ఆర్డర్స్ మీద డ్రాయింగ్స్ చేస్తాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నైట్ షూట్స్ టైమ్‌లో అందరికీ ఐస్‌క్రీమ్స్ తెప్పించేదాన్ని. ఆ సినిమాలో నా భాగస్వామ్యం అంతే... (నవ్వుతూ) -
రొమాంటిక్ సీన్లో నటించాలంటే సిగ్గు: అఖిల్
Akhil Akkineni Interview With Sakshi TV: ‘‘ప్రస్తుతం మీకున్న మూడు విష్లు ఏంటి?’’ అనే ప్రశ్నకు.. మూడో విష్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అఖిల్. మరి మొదటి రెండు విష్లు? ‘సాక్షి’ టీవీతో ఆ విషయాలు, ఎన్నో విశేషాలు అఖిల్ పంచుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో హర్ష (అఖిల్ పాత్ర పేరు) సోల్ సెర్చింగ్‌లో ఉంటాడు. తనని తను కనుక్కునే ప్రయత్నం. సినిమాలో హర్ష తనకు 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ అంటాడు. నాకు పర్సనల్‌గా ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంటూ కెరీరే. ఇక సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై మాట్లాడుతూ.. రొమాంటిక్ సన్నివేశాల్లో తాను చాలా ఇబ్బంది పడతానని. షూటింగ్ సమయంలో చుట్టూ వంద మంది ఉంటారు అలాంటి వాతావరణంలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి కొంచెం సిగ్గనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లికి మీ నిర్వచనం ఏంటంటే.. ఇద్దరూ కంఫర్ట్‌గా ఉండాలి. నువ్వు నీలా ఉండగలగాలి, వాళ్లను వాళ్లలా ఉండనివ్వాలి. లవ్‌లో పడ్డారట కదా.. అఖిల్ (ఆశ్చర్యపోతూ..) ఈ చిత్రంలో ‘ఏ జిందగీ’ పాట పాడిన అమ్మాయి వాయిస్‌తో లవ్‌లో పడ్డానని అన్నానంతే. ఆ పాట వినగానే ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వాయిస్’ అని భాస్కర్‌తో అన్నాను. రోజూ ఉదయం ఒక్కసారైనా ఆ పాట వింటున్నాను. దేవుణ్ణి మూడు కోరికలు కోరుకునే అవకాశం వస్తే మీరు ఏం అడుగుతారు? ‘కరోనా పాండమిక్ వెళ్లిపోవాలి. రెండోది థియేటర్స్ అన్నీ తెరుచుకుని ప్రేక్షకులతో కళకళలాడాలి. మూడోది ‘మోస్ట్ ఎలిజిబుల్...’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అన్నారు అఖిల్. -
‘థ్యాంక్యూ బ్రదర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లాలనుకున్న’
బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. అనసూయ గర్భిణిగా నటించిన ఈ చిత్రం మే 7న ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలైంది. గర్భిణి అయిన అనసూయ ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడితో కలిసి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుని సక్సెస్ బాట పట్టింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మదర్స్ డే సందర్భంగా సాక్షి టీవీ ఈ మూవీ విషయాలపై అనసూయతో ముచ్చటించింది. ఈ సినిమా సక్సెస్, తన పాత్ర గురించి అనసూయ మాటల్లో విందాం. -
మహిళా దినోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూ- సినిమాల్లో సగమెక్కడ
-
సినిమాల్లో... సగమెక్కడ?
వాళ్ళు... ఆకాశంలో సగం! అందరి జీవితాల్లోనూ సగం!! ప్రతి మనిషి జీవితానికీ మూలం వాళ్ళే! ప్రతి మగాడి విజయం వెనుకా వాళ్ళే!! కళలకు కేంద్రం వాళ్ళే! కలలకు అందమూ వాళ్ళే!! కానీ... పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు దక్కాల్సిన స్థానం దక్కుతోందా? సినీ లోకంలో స్త్రీకి ప్రాధాన్యం లభిస్తోందా? నలుగురు మహిళా టెక్నీషియన్లతో స్పెషల్ డిస్కషన్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు , మళ్లీ రాత్రి 11.30కు ‘మహానటి’ సినిమా చేసేప్పుడు ఈ సినిమాకు చెందిన యూనిట్లో 99శాతం మంది మహిళలే ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది - అనీ మాస్టర్, కొరియోగ్రాఫర్ పాతికేళ్ళ క్రితం నేను ఫస్ట్ సినిమాల్లో జాయిన్ అవుతానన్నప్పుడు మా నాన్నగారు కాళ్లు విరగ్గొడతానన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. స్త్రీల టీమ్ వల్ల సినిమాలో మెల్ల మెల్లగా ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. - సునీత తాటి, నిర్మాత ఇప్పుడు మేం మహిళా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నాం అంటే అందుకు భానుమతీ రామకృష్ణ వంటి తొలితరం వారు వేసిన పునాదులే కారణం. స్త్రీలు సినిమాల్లోకి వస్తే... మన ఇంట్లో వాళ్ళ కన్నా... ఎదురింటి, పక్కింటివాళ్ళ వల్లే పెద్ద ప్రాబ్లమ్! - చైతన్య పింగళి, రైటర్ అండ్ కో-డైరెక్టర్ ఒక మహిళా సాంకేతిక నిపుణురాలిగా నేను రాణిస్తున్నాను అంటే దానికి కారణం నా కుటుంబం నుంచి నాకు లభించిన సపోర్టే. - మోనికా రామకృష్ణ ప్రొడక్షన్ డిజైనర్ - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్‌కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
'అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టం'
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులను విడిచిపెట్టేది లేదని ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ హెచ్చరించారు. శుక్రవారం సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. 14400 నంబర్‌కు సమాచారం అందిస్తే చాలు.. వారి అవినీతికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. అవినీతిని అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. కాగా, టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వేల కాల్స్ వచ్చాయని తెలిపారు. కానీ అందులో 770 కాల్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోని విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. నిజాయితీపరులు పై ఎటువంటి కేసులు నమోదు చేయమని, అన్ని రకాలుగా విచారించిన తర్వాత అవినీతికి పాల్పడ్డారని తేలాకే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు విశ్వజిత్ పేర్కొన్నారు. -
'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'
సాక్షి, హైదరాబాద్ : దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తామనే అంశం మీద కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని క్రేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని, త్వరలోనే దానిని పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్య అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను రాష్ట ప్రభుత్వమే పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన పంపకాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కిషన్‌రెడ్డి తెలిపారు. -
అప్పుడు బీజేపీ.. ఇప్పుడు కాంగ్రెస్.. : వైఎస్ జగన్
సాక్షి, శ్రీకాకుళం : 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కాపురం చేస్తున్నారని, ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ ఇలా రెండు పార్టీలతో జతకలిసిన ఆయన.. మేము వాళ్లతో కలుస్తామని, వీళ్లతో కలుస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలతో మమేకమవుతూ.. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా ఆయన సాక్షి టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజకీయ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అదే సమయంలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. ‘2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నరేంద్రమోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగున్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతోనూ జతకట్టిన చంద్రబాబు.. ‘వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు’ అని మాపై విమర్శలు చేస్తున్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం రాలేదు. కానీ వడ్డీలు కట్టమని నోటీసులు వస్తున్నాయి. చంద్రబాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు పూర్తిగా నష్టపోయారు. -
‘కేఈ కుటుంబం నుంచి ప్రాణహాని’
కర్నూలు: తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని పథకం ప్రకారమే హత్య చేశారని ఆయన భార్య శ్రీదేవిరెడ్డి ఆరోపించారు. తన భర్త మరణానికి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు కారణమని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేఈ కృష్ణమూర్తి అక్రమాలపై పోరాడినందునే తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. కేఈ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమకు ఏం జరిగినా కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను చంపిన హంతకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో నిష్పక్ష విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో నారాయణరెడ్డి ఎంతో పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు. -
'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం
న్యూఢిల్లీ: మహిళల భద్రత, యువతకు ఉపాధి కల్పన, పేదలకు సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ తెలిపారు. సోమవారం సాక్షి టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనైతిక పద్ధతిలో కేజ్రీవాల్ ప్రచారం సాగుతోందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారని బేడీ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమౌతుందని అభిప్రాయ పడ్డారు. ప్రధాని ఇచ్చిన 'సబ్ కీ సాత్..సబ్ కా వికాస్' నినాదాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నానని కిరణ్ బేడీ తెలిపారు.