
చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు మళ్లీ ఓటేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గత ఎన్నికల ముందు ప్రధాన మంత్రి మోదీని దారుణంగా తిట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మోదీతో స్నేహం కోసం మూడున్నరేళ్లుగా నానా పాట్లు పడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, ఆయన బండి కొన్నంత మాత్రాన యుద్ధం చేసేసినట్టా అని పేర్నినాని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే 2019లో ఎలాగైతే నోట్లో వేలుపెట్టుకుని చూశాడో 2024లో కూడా అలానే పవన్ చూస్తాడని, జగన్‌ని మాత్రం ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానితో స్ట్రయిట్ టాక్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 11.30 గంటలకు సాక్షి టీవీలో ప్రసారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment