పవన్‌ సీటు కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారా?: పేర్ని నాని | Perni Nani Comments On Pawan Kalyan And Chandrababu Over Candidates List Announced, Details Inside - Sakshi
Sakshi News home page

Perni Nani: పవన్‌ సీటు కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారా?

Published Sat, Feb 24 2024 6:21 PM | Last Updated on Sat, Feb 24 2024 7:14 PM

Perni Nani Comments On Pawan Kalyan And Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైందని.. ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడని, 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా. పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సమేత గుర్తొస్తుంది. పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో’’ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట. చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు. కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు. చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే. భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు. కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు. ఈ జాబితాతో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది’’ అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్‌?: సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement