పేర్ని నానితో స్ట్రయిట్ టాక్: మా బందరు ప్రజల చిరకాల కల నెరవేర్చారు | sakshi tv straight talk with ex minister perni nani | Sakshi
Sakshi News home page

పేర్ని నానితో స్ట్రయిట్ టాక్: మా బందరు ప్రజల చిరకాల కల నెరవేర్చారు

Published Sun, Dec 31 2023 8:25 PM | Last Updated on Sun, Dec 31 2023 8:38 PM

sakshi tv straight talk with ex minister perni nani - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేసినా పబ్లిసిటీ చేసుకోరని, చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసమే పుట్టారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. బందరు పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని, 24 నెలల్లోనే పోర్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు.  సీఎం జగన్‌ మా బందరు ప్రజల చిరకాల కల నెరవేర్చారని,  నా జీవితంలో ఈ పోర్టు నిర్మాణం చాలా సంతృప్తి నిచ్చిందన్నారు. 

చంద్రబాబు శిలాఫలకం మాత్రమే వేస్తే, టీడీపీ నేతలు పోర్టు నిర్మాణం చూసి మాట్లాడాలన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు ఒక్క సీఎం జగన్ హయాంలోనే నిర్మిస్తున్నారని, చంద్రబాబు ఒక్క కియా తెస్తే సీఎం జగన్ అనేక పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. 

రామోజీకి కులపిచ్చి పెరిగిపోయి ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని, తన కులం వ్యక్తి చంద్రబాబు సీఎం అవ్వాలని నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేని అభివృద్ధి సీఎం జగన్‌ చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడైనా సీఎం జగన్‌లా సంస్కరణలు తీసుకొచ్చారా?, చంద్రబాబు సినిమా అయిపోయిందని, అందుకే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. టీడీపీలో అభ్యర్థులను వేరే నియోజకవర్గాలకు మార్చలేదా?, చంద్రబాబు చంద్రగిరిలో ఎందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించారు. జగన్‌ కోసమే పనిచేసే ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో ఉంటారని, అవసరాల కోసం వచ్చే వారు పార్టీ మారినా నష్టం లేదన్నారు. సీఎం అయ్యే సీన్‌ లేదని పవనే చెప్పారని, పవన్‌కు అర్హత లేదని లోకేష్‌ నిజం చెప్పాడన్నారు. 

లోకేష్ రెడ్ బుక్ కోసం పాదయాత్ర చేశారా..? , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోవడం మంచిదైందని, లేదంటే బాబుకు అమ్ముడుపోయి మమ్మల్ని విమర్శించేవారన్నారు. మాజీ మంత్రి పేర్ని నానితో సాక్షి స్ట్రయిట్‌ టాక్‌ ఆదివారం గంరాత్రి 7.30 ని.లకు,తిరిగి సోమవారం మధ్యాహ్నం గం. 12.30 ని.లకు సాక్షి టీవీలో ప్రసారమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement