
సాక్షి, హైదరాబాద్ : దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తామనే అంశం మీద కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని క్రేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని, త్వరలోనే దానిని పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్య అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను రాష్ట ప్రభుత్వమే పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన పంపకాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment