సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలులో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సీఆర్ చౌదరీ బుధవారం తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ (సీఈజెడ్) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఈజెడ్ ఏర్పాటులో కేంద్రం చేపట్టిన చర్యలేమిటో తెలపాలని సంబంధిత మంత్రిని ఆయన కోరగా..ప్రస్తుతానికి సీఈజడ్ ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఐటీ టవర్‌కూ మొండిచేయే..!
రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా విశాఖ జిల్లా దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఐటీ టవర్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని సీఆర్ చౌదరీ వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని మాత్రం వెల్లడించలేదు. ఏ మేరకు నిధుల కేటాయింపులు జరిగాయన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment