
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 587 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 195 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ.. రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ.. మూడో విడతలో 124 జెడ్పీటీసీ,1343 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా.. మొత్తం 32,007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ఫలితాలు ఫలితాలు మే 27న వెల్లడికానున్నాయి.
సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
ముగిసిన తెలంగాణ పరిషత్ ఎన్నికల పోరు
Comments
Please login to add a commentAdd a comment