MPTC ZPTC elections
-
యువతరం చేతికి గ్రామ నాయకత్వం
సాక్షి, అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో ఏప్రిల్ నుంచి తిరిగి సర్పంచుల పాలన మొదలైంది. 1,30,966 మంది వార్డు సభ్యులుగా, 13,097 మంది సర్పంచులుగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. ఈ ఏడాదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. 9,675 మంది ఎంపీటీసీలు, 650 జెడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మందికి పైగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. వీరిలో 85 శాతం మంది యువ నాయకత్వమే కావడం గమనార్హం. ఇదే సమయంలో గ్రామీణ పాలనలో ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా గ్రామాల్లో గ్రామ కంఠంగా వర్గీకరించిన ప్రాంతంలో ఇళ్లకు తొలిసారి అధికారిక యాజమాన్య పత్రాల జారీ ప్రక్రియను చేపట్టింది. గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా జిల్లా పరిషత్లలోనూ రెండో డిప్యూటీ చైర్మన్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవులను కొత్తగా సృష్టించి పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే జెడ్పీలో రెండో డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ముగియగా.. మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. -
సీఎంకు పంచాయతీరాజ్ శాఖ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు సీఎం జగన్‌ను కలిశారు. -
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
-
టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు:కాకాణి
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలుపొందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డిలు అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని తెలిపారు. రూ.లక్ష కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్ జమ చేశారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాదరణతో వైఎస్సార్సీపీ మెజారిటీ గతానికంటే పెరుగుతోందన్నారు. ఎన్నికల కమీషన్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఓటమిని ముందే పసిగట్టి బహిష్కరణ డ్రామా ఆడారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీటీసీ 65 స్థానాలకి ఎన్నిక జరిగితే 63 స్థానాల్లో వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు. ఆరుకి ఆరు జడ్పీటీసీలూ కైవసం చేసుకొన్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల్లో ఓట్ల శాతం పెరిగిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకీ ప్రజాదరణ పెరుగుతోందని, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమం వల్లే జిల్లాలో ప్రతిపక్షానికి ఒక్క జడ్పీటీసీ కూడా దక్కలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వానికి రాష్ట్రంలో తిరుగులేదని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. -
ప్రజాభిమానానికి అధికార ముద్ర
పని చేస్తే ఫలితం దక్కుతుంది; ప్రజలు మెచ్చితే అన్ని కుట్రలూ వీగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెల్లడైన సరళమైన సత్యం ఇది. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు జనం బ్రహ్మరథం పట్టడం దాన్నే తెలియజేస్తోంది. ఈ ఎన్నికలు చాలా కారణాల వల్ల చరిత్ర. జరగాల్సినవి జరగక పోవడం, జరగాల్సిన సమయంలో జరగకపోవడం, జరిగినట్టే జరిగి ఆగిపోవడం, జరిగినా వెంటే ఫలితాలు తెలియకపోవడం... ఎన్నికల చరిత్రలో ఇవి చెరిగిపోవాల్సిన పేజీలు. ఇన్ని జరిగినా నాలుగు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనీవినీ ఎరుగని రీతిలో అధికార పార్టీ గెలవడం సువర్ణాక్షరాలతో రాయాల్సిన పుట. ఇది ప్రజాభిమానం వల్లే సాధ్యమైంది. చేస్తున్న పాలనకు వారి అధికార ముద్ర పడ్డందువల్లే సంభవమైంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో గానీ, విభజిత ఏపీలో గానీ ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల అన్నిటిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది అధికార దుర్వినియోగంతోనో, మరో అక్రమంతోనో సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో నలభై శాతం ఓట్లు వచ్చాయి. దానర్థం ఏమిటి? ఆయా చోట్ల అధికార పార్టీ ఏమైనా గొడవలు చేస్తే ఎదుర్కొనేవారు గణనీయంగానే ఉన్నా రన్నమాట. దానికి తోడు ఆయా వ్యవస్థల అండ ఎటూ ఉంది. అలాంటిది స్థానిక ఎన్నికలలో నిజంగా తెలుగుదేశంకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆ పార్టీ ఊరుకుంటుందా? టీడీపీ ఇక్కడ కూడా రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేసింది. ఒక పక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్క రించామని చెబుతూనే, వివిధ నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్య ర్థులకు బీఫారాలు ఇచ్చారు. 8 వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ గెలిస్తే, 9 వందలకు పైగా టీడీపీ గెలిచింది. మరి పోటీలో ఉన్నట్లా, లేనట్లా? నామినేషన్లు వేసిన తర్వాత చాలాకాలం ఎన్నికలు జరగకుండా చేయడంలో టీడీపీ సఫలమైంది. ఏడాదిన్నరపాటు ఎన్నికల ప్రక్రియ నడిచిన సందర్భం దేశంలో ఇదొక్కటే కావచ్చు. కరోనా కేసులు లేన ప్పుడు ఎన్నికలను వాయిదా వేయించింది. ఆ తర్వాత కరోనా కేసులు ఉధృతంగా ఉన్న రోజుల్లో జడ్పీ, మండల ఎన్నికలను పక్కనబెట్టి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా పథకం అమలు చేయిం చింది. ఈ ఎన్నికలలో పూర్తిగా పరాజయం చెందడంతో కొత్త వ్యూహంలోకి వెళ్లారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపకుండా ఆపు చేయించారు. చాలా చిత్రంగా నామినేషన్లు పూర్తయిన ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించకపోవడం కూడా ఒక చరిత్రే. స్థానిక ఎన్నికలపై ఎవరైనా పరిశోధన చేయదలిస్తే, ఇవన్నీ ఆసక్తికర అధ్య యన అంశాలు అవుతాయి. మధ్యలో ఏపీ ప్రభుత్వంపై ఎన్నికల కమిషనర్ చాలా దారుణ మైన లేఖను కేంద్రానికి రాయడం జరిగింది. నిజానికి ఈ లేఖ టీడీపీ ఆఫీసులో తయారైందని ఎక్కువ మంది నమ్మకం. మొదట ఆ లేఖతో తనకు సంబంధం లేదని చెప్పిన నిమ్మగడ్డ, ఆ తర్వాత కేసును సీఐడీ టేకప్ చేయడంతో టీడీపీని రక్షించడం కోసం తానే రాశానని చెప్పు కోవలసి వచ్చింది. అలాగే ఈ ఎన్నికలపై కోర్టులలో పడినన్ని వ్యాజ్యాలు బహుశా మరే ఎన్నికలపై పడి ఉండకపోవచ్చు. సింగిల్ బెంచ్ జడ్జీ ఎన్నికలు నిర్వహించవద్దని అనడం, డివిజన్ బెంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అయినా మళ్లీ సింగిల్ జడ్జీ ఈసారి ఎన్నికలనే రద్దు చేయడం, తిరిగి అప్పీల్లో డివిజన్ బెంచ్ నాలుగు న్నర నెలల సమయం తీసుకుని ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్థానిక ఎన్నికలు జాప్యం అయితే న్యాయస్థానాలు ప్రభుత్వాలను మందలిస్తుంటాయి. ఈసారి మాత్రం న్యాయ వ్యవస్థ వల్ల కూడా ఎన్నికలు జాప్యం అవడం మరో చిత్రం అని చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కోడ్ అమలు చేసి, జడ్పీ, మండల ఎన్నికలకు అది వర్తింపచేయకుండా కోడ్ ఎత్తివేసి నిమ్మగడ్డ ఈ ఎన్నికలను వాయిదా వేయడమే కుట్రగా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే దానిని లిటిగేషన్‌గా మార్చాయి టీడీపీ, జనసేన. ఒక పక్క తాము ఎన్నికలను బహిష్కరించామని చెబుతూనే మరో పక్క ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ కోర్టుకు వెళ్లడం ఆశ్చర్యమే. నలభై శాతం ఓట్లు కలిగిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాడి వదలివేయడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య మంత్రి జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా బలహీనవర్గాలకు చేరాయి. కులం, ప్రాంతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు దక్కాయి. దాంతో టీడీపీకి చెందినవారు కూడా వైసీపీ వైపు మొగ్గుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ లేకుంటే చంద్రబాబుకు కంచుకోట వంటి కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీలు, తొంభై శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి ఎలా వస్తాయి? ఇది కచ్చితంగా చంద్రబాబుకు అప్రతిష్టే. ఈ 32 ఏళ్లలో కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీ గెలవ లేదు. గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. పంచాయతీ ఎన్నికలలోనే వైసీపీ గెలుపుతో బిత్తరపోయిన చంద్ర బాబు, తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి వచ్చారు. అయినా జడ్పీ, మండల ఎన్నికలలో ఫలితం దక్కకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో టీడీపీ గెలిస్తే మీడియాలో అది పెద్ద వార్తగా ప్రచారం అయింది. కానీ ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో ఆ స్థానం వైసీపీకి దక్కింది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు స్వగ్రామం నిమ్మకూరును టీడీపీకి బలమైన గ్రామంగా భావి స్తారు. అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమా ఇలాకాతో సహా అనేక చోట్ల టీడీపీకి ఒకటి, అరా తప్ప సీట్లు రాలేదు. గత నాలుగు దశాబ్దాలలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి విజయం నమోదు కాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జడ్పీ ఎన్నికలలో అధికార టీడీపీ పది జడ్పీలను మాత్రమే గెలుచుకుంటే, ప్రతిపక్ష కాంగ్రెస్ పదింటిని, టీఆర్ఎస్ రెండింటిని కైవసం చేసుకుంది. మండలాల ఎన్నికలలో టీడీపీకి 482 దక్కితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 430, టీఆర్ఎస్కు 83 వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు 19 జడ్పీలు, టీడీపీకి రెండు, టీఆర్ఎస్కు ఒకటి వచ్చాయి. మండల ఎన్నికలలో కాంగ్రెస్‌కు 620, టీడీపీకి 355, ఇతర పార్టీలు 45 గెలుచుకున్నాయి. అంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా టీడీపీ తన ఉనికిని నిలబెట్టుకోగలిగింది. 2014లో టీడీపీ ఆధిక్యత ప్రదర్శించగలిగినా, వైసీపీ తన పట్టును గట్టిగానే ఉంచుకోగలిగింది. టీడీపీకి 372 జడ్పీటీసీలలో తొమ్మిది జడ్పీలు, వైసీపీ 271 జడ్పీటీసీ లతో మూడు జిల్లా పరిషత్‌లు కైవసం చేసుకున్నాయి. ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. మండల పరిషత్‌లలో టీడీపీకి 386 వస్తే, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 205 వచ్చాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అన్నింటిలోనూ వైసీపీనే విజయం సాధించింది. 83 శాతం డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంటే, 11 శాతం డివిజన్లే టీడీపీకి వచ్చాయి.75 మున్సిపాలిటీలకు గానూ 74 వైసీపీ ఖాతాలో జమ య్యాయి. తాజాగా వెల్లడైన జడ్పీ, మండల ఎన్నికల ఫలితాలలో తొంభై శాతంపైగా వైసీపీకి రావడం టీడీపీకి జీర్ణం కాని విషయమే. ఇవన్నీ రికార్డులే. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీకి కొంత మొగ్గుంటుంది. ఒక్క 2014లో కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వల్ల పూర్తిగా నష్టపోయింది. అది వేరే విషయం. కానీ ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే– ఎనభై, తొంభై శాతం ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా రావడం; ప్రతిపక్ష టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం. ఇదే సమయంలో ఒక విషయం కూడా హెచ్చరించాలి. స్థానిక ఎన్నికలలో ఇంత పెద్ద ఎత్తున గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్‌పై మరింత బాధ్యత పెరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ముందంజలోనే ఉన్నా, వచ్చే రెండున్నరేళ్లు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవలసి ఉంటుంది. ఏ చిన్న ఘటన జరిగినా చిలవలు పలవలు చేయగల సత్తా టీడీపీకి, ఆ పార్టీకి మద్దతిచ్చే మీడియాకు ఉంది. తిమ్మిని బమ్మిగా చేయగల నేర్పరులు వారు. తస్మాత్ జాగ్రత్త! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఈ ఫలితాలు నా బాధ్యతను మరింత పెంచాయి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. పరిషత్ ఎన్నికల విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్షరాల 13,081 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో(81 శాతం) వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల (99 శాతం) వైఎస్సార్ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశారని అన్నారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ప్రజలకు మంచి జరగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందన్నారు. కోవిడ్ పేరుతో గతంలో కౌంటింగ్ కూడా వాయిదా వేయించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చదవండి: MPTC, ZPTC elections results: పంచాయతీ, మునిసిపల్‌ను మించి జైత్రయాత్ర ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు -
సందడే సందడి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పెద్దఎత్తున విజయోత్సవాలు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కన్పించింది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పార్టీ విజయదుందుభి మోగించటంతో కార్యకర్తలు, నేతల్లో అభిమానం ఉప్పొంగింది. ఏకపక్ష ఫలితాలు వెలువడతాయనే నమ్మకంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ఆదివారం ఉదయం నుంచే నింగినంటేలా సంబరాలకు తెరతీశారు. కౌంటింగ్ ఆరంభం నుంచే తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో పార్టీ అభిమానులు సందడి చేశారు. మండల కేంద్రాలు, పంచాయతీ కేంద్రాల్లోనే కాకుండా చిన్నచిన్న పల్లెల్లోనూ పెద్దఎత్తున విజయోత్సవాలు జరిగాయి. డప్పు నృత్యాల మధ్య పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. పార్టీ శ్రేణులు వాడవాడలా మిఠాయిలు పంచుకున్నారు. అతితక్కువ కాలంలోనే పెద్దఎత్తున అమలైన సంక్షేమ ఫలాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. అన్ని జిల్లాల్లోని వైఎస్సార్సీపీ శిబిరాలు ఇలా ఆనందోత్సాహాలతో కళకళలాడితే అదే సమయంలో తెలుగుదేశం కార్యాలయాలు మాత్రం వెలవెలబోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో ఆ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలు కరువయ్యారు. అన్నిచోట్లా నిశ్శబ్ద వాతావరణం తాండవించింది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రోజంతా సందడే కన్పించింది. ఉ.11 గంటలకల్లా అనేక ప్రాంతాల నుంచి అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. పెద్దఎత్తున్న బాణసంచా కాల్చారు. డప్పుల మోత.. అభిమానుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. మంత్రులు, సీనియర్ నేతలు ధన్యవాదాలు చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట బాణసంచా కాలుస్తున్న పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రజా విజయమని కొనియాడారు. సీఎం జగన్ స్వచ్ఛమైన పాలనను కాంక్షిస్తూ ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఇదని చెప్పారు. అనంతరం ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే గడువు ముగిసినా.. గెలవలేమని భావించే చంద్రబాబు ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎన్నికలు పెట్టాలని కృషిచేసినా.. చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. బాబు, లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలను తాము బహిష్కరించాం అని మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలకు సిగ్గులేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాల్లో మార్పేమీ లేదని గుర్తుచేశారు. ఇప్పటికిప్పుడు టీడీపీ మొత్తం రాజీనామా చేసినా.. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సీఎం జగన్ జనరంజక పాలనకు ఈ ఫలితాలు చక్కని నిదర్శనమన్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని మరో ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ధీమా వ్యక్తంచేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, వైఎస్సార్సీపీ నేతలు బల్లి శ్వేత, చల్లా మధు, ఎన్ఆర్ఐ రత్నాకర్, జూపూడి ప్రభాకర్‌రావు, ఎ. నారాయణమూర్తి, ఈద రాజశేఖర్‌రెడ్డి, చిల్లపల్లి మోహనరావు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
గ్రహణం వీడింది: సజ్జల
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై తాజాగా హైకోర్టు ఆదేశాలతో దీర్ఘకాలంగా ప్రజా తీర్పునకు పట్టిన గ్రహణం వీడినట్లయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018లో సర్పంచ్ ఎన్నికలు, 2019లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా గత సర్కార్ నిర్వహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాక టీడీపీ కార్యాలయం సూచనల మేరకే 2020 మార్చి 15న నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా సాకుతో ఏకపక్షంగా వాయిదా వేశారని చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు రోజుల ముందు కరోనా ప్రభావం లేకున్నా నిమ్మగడ్డ కావాలనే వాయిదా వేసినట్టు తెలిపారు. అజెండాలో లేకున్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను ముందుకు తెచ్చి టీడీపీపై కృతజ్ఞత చాటుకుని నిమ్మగడ్డ పదవీ విరమణ చేసి వెళ్లిపోయారన్నారు. చంద్రబాబే దోషి.. ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగిన పరిణామాలన్నింటికీ చంద్రబాబే దోషి అని సజ్జల స్పష్టం చేశారు. వ్యవస్థల్లో సాంకేతిక లొసుగులను అడ్డు పెట్టుకుని పార్టీ నేతలతో పిటిషన్లు దాఖలు చేయించడం వల్ల ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగిందన్నారు. దాదాపు 6 నెలలపాటు ఓట్ల లెక్కింపు జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. విజ్ఞులు, సామాజికవేత్తలు, మేధావులు ఈ అంశంపై ఆలోచించాలని కోరారు.ఎన్నికల ప్రక్రియను ఏళ్ల తరబడి ఆపగలగడాన్ని అంగీకరించాలా? అని ప్రశ్నించారు. దిశ బిల్లు ప్రతులను లోకేశ్ తగలబెట్టడం ఆయన మానసిక స్థితికి నిదర్శమన్నారు. పింఛన్లపై దుష్ప్రచారం పేదరిక నిర్మూలనకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలను తెలియచేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వాల్మీకి, బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి, బోయ కులస్తుల ఆత్మీయ సమావేశానికి సజ్జల హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇవ్వగా సీఎం జగన్ ఆ సంఖ్యను 60 లక్షలకు పెంచారని చెప్పారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండూ ఓసీలకు రిజర్వ్ అయిన మండలాల్లో ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని వెల్లడించారు. బీసీలు ఇతర కులాలకు కూడా నాయకత్వం వహించేలా సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సజ్జల సూచించారు. సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదే ఆనాడు వాల్మీకి రామాయణాన్ని రచిస్తే, సీఎం జగన్ పేదల జీవితాలు బాగు చేసే కార్యక్రమాలను రూపొందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. బోయ, వాల్మీకి కులానికి చేసిన వాగ్దానాలను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి సీఎం జగన్ పలు పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. బీసీ కులాల సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు నెలలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో వాల్మీకిలు బీసీలుగా మరికొన్ని చోట్ల ఎస్టీలుగా ఉన్నారని, దీన్ని సరి దిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సమావేశంలో నవరత్నాలు నారాయణమూర్తి, వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇన్ని రోజులు పరిషత్ ఎన్నికల ప్రక్రియకు పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. ప్రజస్వామ్య ప్రక్రియను అడ్డుకునే కుట్రలు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉందని, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశంతో మరికొంత సమయం వాయిదా పడిందన్నారు. గత ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ జరగాల్సి ఉండగా అప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా చేశారని సజ్జల తెలిపారు. ప్రభుత్వంతో చర్చించకుండానే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలనే నిమ్మగడ్డ అమలు చేశారని అన్నారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చదవండి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎన్నికల ప్రక్రియను హత్య చేసిన దోషి చంద్రబాబు అని సజ్జల మండిపడ్డారు. అడ్డదారులు తొక్కడమే బాబు నైజం అని దుయ్యబట్టారు. ఏడాది తర్వాత ఈ రోజుకు గ్రహణం వీడిందన్నారు. మహిళల భద్రతో కోసం దిశ చట్టం తీసుకోచ్చామని తెలిపారు. 53 లక్షల మందికిపైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. దిశ చట్టం ప్రతులను తగులబెట్టారంటే లోకేష్ మానసికస్థితి అర్థం చేసుకోవాలన్నారు. దిశ చట్టం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, తమకు ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు చేయగలుగుతున్నారని సజ్జల పేర్కొన్నారు. -
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో వాయిదా పడింది. మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్ఈసీ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వుల మేరకే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని ఎస్ఈసీ తెలిపింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఈ పరిస్థితులలో అసాధ్యంతో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని ఎస్ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు.. కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య! సీఎం జగన్ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అప్పీల్
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి గురువారమే పిటిషన్ దాఖలు ప్రక్రియ పూర్తైందని, పిటిషన్‌కు నెంబరు కేటాయింపు లాంటి అంశాలు న్యాయస్థానం పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపధ్యంలో కౌంటింగ్‌కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదికిపైగా ఎన్నికల ప్రక్రియ.. వరుసగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఏడాదికిపైగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలకు మొదట 2020 మార్చి 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసి తుది అభ్యర్ధుల జాబితాలు ఖరారైన తర్వాత అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనా పేరుతో ఆ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన సమయంలోనే పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నా నిమ్మగడ్డ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారన్న ఆరోపణలున్నాయి. నిమ్మగడ్డ స్థానంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 8వతేదీన మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయిన ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు వెలువరించింది. గెలిచినా ఏడాదిగా నిరీక్షణ.. 2020 మార్చిలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. హైకోర్టు తాజా తీర్పు తర్వాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యధాతథంగానే కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతంలోనే స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు ఏడాదికిపైగా వారంతా పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఎదురుచూస్తూనే ఉన్నారు. 11 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పరిషత్ ఫలితాలతో లింక్ శాసన మండలిలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి కావాలని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు జిల్లాలవారీగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్సీపీ ఖాయంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మండలిలో అధికార వైఎస్సార్సీపీ బలం మరింత పెరగకుండా అడ్డుపడేందుకే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఉద్దేశపూర్వకంగా న్యాయ వివాదాలు సృష్టిస్తూ పరిషత్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆటంకాలు కల్పిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విజయనగరం జిల్లాలోని కొటియా గ్రామాలలో ఉద్రిక్తత
-
ఊపందుకున్న జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
నెల్లూరు జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
చిత్తూర్ జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
కర్నూల్ జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
విజయవాడ లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
తూర్పు గోదావరి జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
విజయనగరం జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్
-
ప్రకాశం జిల్లా లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది
-
ఆంధ్ర ప్రదేశ్ పరిషత్ ఎన్నికలు
-
వీరంగం సృష్టించిన టీడీపీ అభ్యర్థి
-
వైఎస్సార్సీపీ హవా.. ఏకగ్రీవాల వెల్లువ!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగియడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో వైఎస్సార్సీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. నియోజకవర్గం పరిధిలో ఉన్న 95 ఎంపీటీసీలకుగాను 86 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (చదవండి: వలసలతో టీడీపీ కుదేలు..) చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం 4 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతోపాటు చిత్తూరు జిల్లాలోని 65 జడ్పీటీసీలకుగాను 15 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా మొత్తంలో 858 ఎంపీటీసీలకుగాను 225 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్న ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే! (చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు.. నెల్లూరు: 46 జడ్పీటీసీలకుగాను 12చోట్ల ఏకగ్రీవం. గుంటూరు: జిల్లాలో ఉన్న 54 జడ్పీటీసీలకుగాను 8చోట్ల ఏకగ్రీవం, మాచర్ల నియోజకవర్గంలో 70 చోట్ల ఏకగ్రీవం. వైఎస్సార్ కడప: 50 జడ్పీటీసీలకుగాను 35 చోట్ల ఏకగ్రీవం. జడ్పీ చైర్మన్‌ను కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ. కృష్ణా: మండవల్లి జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయనిర్మల ఏకగ్రీవం, గన్నవరం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి దుట్టా సీతారామలక్ష్మి ఏకగ్రీవం. పశ్చిమగోదావరి: ఏలూరు రూరల్ జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సరస్వతి ఏకగ్రీవం, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి బాబ్జి ఏకగ్రీవం. కర్నూలు: 53 జడ్పీటీసీలకుగాను 14చోట్ల ఏకగ్రీవం, 805 ఎంపీటీసీలకుగాను 150చోట్ల ఏకగ్రీవం. ప్రకాశం: 55 జడ్పీటీసీలకుగాను 11చోట్ల ఏకగ్రీవం. శ్రీకాకుళం: 667 ఎంపీటీసీలకుగాను 48చోట్ల ఏకగ్రీవం. టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు కళా వెంకట్రావ్ సొంత మండలంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, 12 ఎంపీటీసీలకుగాను 12 చోట్లా ఏకగ్రీవం. విజయనగరం: 34 జడ్పీటీసీలకుగాను 3చోట్ల ఏకగ్రీవం, 549 ఎంపీటీసీలకుగాను 25 చోట్ల ఏకగ్రీవం. విశాఖపట్నం: 39 జడ్పీటీసీలకుగాను ఒకచోట ఏకగ్రీవం. 651 ఎంపీటీసీలకుగాను 20 చోట్ల ఏకగ్రీవం. తూర్పుగోదావరి: 1086 ఎంపీటీసీలకుగాను 30చోట్ల ఏకగ్రీవం. అనంతపురం: 841 ఎంపీటీసీలకుగాను 41చోట్ల ఏకగ్రీవం. -
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక ్స్ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూత్ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు. పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. -
జనవరి 9, 10 తేదీల్లో ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్?
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును వచ్చే జనవరి 9 లేదా 10 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఏపీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. ఆయా పదవుల పదవీకాలం పూర్తయ్యేలోపు ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, 2018 ఆగస్టులో సర్పంచ్ల పదవీకాలం, ఈ ఏడాది జూన్‌లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం వీటికి సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయకుండా కాలయాపన చేసింది. దీంతో ఎన్నికలు సకాలంలో జరగలేదు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఒకట్రెండు రోజుల్లో బ్యాలెట్ ముద్రణ టెండర్లు రాష్ట్రంలో జనవరి 10 తర్వాత స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13,065 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 1.30 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలి. వీటిని మూడు, నాలుగు దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తయ్యే అవకాశముంది. దీంతో త్వరగా ఎన్నికల ప్రక్రియ ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహిస్తే బాగుంటుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఆ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. అవి ముగియగానే పది పదిహేను రోజుల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభించాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
‘ప్రత్యేక’ పాలనలోకి..
సాక్షి, మండపేట(పశ్చిమ గోదావరి) : జిల్లా, మండల పరిషత్తులు ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఈ నెల 3వ తేదీతో ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం, 4వ తేదీతో జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనున్నాయి. జిల్లాలో 1,102 మంది ఎంపీటీసీ సభ్యులు, 63 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జిల్లాలోని ఎటపాక, చింతూరు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావడంతో అవి మినహా మిగిలిన మండలాల్లోని ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం 3న ముగియనుంది. పరిషత్తులకు ఎన్నికలు జరిగి, కొత్త పాలక వర్గాలు ఏర్పడేంత వరకూ జిల్లా, మండల పరిషత్తులు ప్రత్యేక పాలనలో ఉండనున్నాయి. గతంలో మాదిరిగా జిల్లా పరిషత్తుకు కలెక్టర్‌ను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికారులు అంటున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ నుంచి సీఎం కార్యాలయానికి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు రెండు రోజుల్లో జిల్లా, మండల పరిషత్తుల పదవీ కాలం ముగియనుండగా ‘పరిషత్ పోరు’కు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) వారీగా జూలై 3వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను ఎంపీడీఓ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలను జెడ్పీ సీఈఓ సిద్ధం చేయాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీల్లో ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారీగా ఓటర్ల ఫొటోలు, డోర్ నంబర్లతో అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. వీటి ద్వారా ఎంపీటీసీ పరిధి మేరకు అధికారులు జాబితాలను రూపొందిస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. జూలై 3వ తేదీన వీటిని అందుబాటులో ఉంచనున్నారు. -
సంగ్రామానికి సమాయత్తం
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కొత్తగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించింది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసి 11 నెలలు కావస్తుండగా గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ జరిగింది. ఈ తంతు ముగియకముందే జూలై 4తో మండల పరిషత్ పాలక మండళ్లు రద్దు కానున్నాయి. తాజాగా వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఓటర్ల జాబితా సేకరణ, పోలింగ్ కేంద్రాల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, జూలై 3 నాటికి అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జూలై 4తో ముగియనున్న గడువు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు 2104 మే నెలలో జరిగాయి. ఫలితాలు మాత్రం జూన్‌లో విడుదల చేయడంతోపాటు కొత్త పాలకమండళ్లు జూలై 3న కొలువుదీరాయి. ఫలితంగా ఈ ఏడాది జూలై 4తో ఈ మండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్తగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఇదివరకూ పోలింగ్ కేంద్రాలు గుర్తించడంతోపాటు ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలకు.. రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు సంబంధించి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు రేగిడి మండలంలో 21 ఉండగా, అత్యల్పంగా వంగర మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో 2,19,313 ఓట్లు ఉన్నాయి. వీటిలో 1,12,271 మంది పురుష ఓటర్లు, 1,08,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోటీకి టీడీపీ సీనియర్ల అయిష్టత ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేతల్లో ఆందోళన అధికంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండటంతో పలు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఫలితంగా మండల పరిషత్ పాలక మండలి పీఠంపై టీడీపీ నేతలు కూర్చుని ఐదేళ్లపాటు చక్రం తిప్పారు. జన్మభూమి కమిటీల పెత్తనం, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం, ఇసుక మాఫియా, నీరు చెట్టు నిధుల దోపిడీ టీడీపీకి అపకీర్తి తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా సంతకవిటిలో ఇండిట్రేడ్ పేరుతో ఆ పార్టీ నేతల మోసాలు వెలుగుచూడటం, రేగిడి మండలంలో అక్రమ ఇసుక మైనింగ్ రాజాంలో టీడీపీకి కొరకరాని కొయ్యలుగా మారి వెంటాడుతున్నాయి. ఈ మోసాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో వీటి ఫలితం స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికల్లోనూ రేగిడి, సంతకవిటి మండలాల్లో వీటి ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు ఈ దఫా ఎన్నికలకు ముందుపడేందుకు నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ వైపు ఫిరాయింపుదారులు 2014లో టీడీపీకి అధికారం రావడంతో రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. రాజాంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపీపీ కావల్సి ఉండగా, ఇక్కడ టీడీపీ నేతలు తమ అధికార పెత్తనంతో చక్రం తిప్పారు. మారెడుబాక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడికి తాయిలాలు ఎరవేసి టీడీపీలోకి చేర్చుకున్నారు. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకుగానూ అప్పట్లో వైఎస్సార్సీపీ 8 గెలుచుకోగా, ఒక ఎంపీటీసీ స్థానం టీడీపీలోకి చేరింది. మరో ఇండిపెండెంట్ ఎంపీటీసీ టీడీపీకి మద్దతి ఇచ్చారు. రాజాం మండల పరిషత్ అధికారులు కూడా అప్పట్లో అధికార పార్టీకే సహకరించారు. అనంతరం అంతకాపల్లి గ్రామానికి చెందిన మరో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ టీడీపీలో చేరారు. ఇలా పార్టీ ఫిరాయించిన వారంతా ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. రేగిడి మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు, సంతకవిటిలో ఒక ఎంపీటీసీ ఇటు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి పెడుతున్న సంక్షేమ పథకాలు కూడా మంచిగా ఉండటంతో అందరి దృష్టి ఇటు పడింది. పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం జూలై 4తో ప్రస్తుతం ఉన్న మండల పరిషత్ పాలకమండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పాలకమండలిల ఏర్పాట్లు జరగాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఎంపీటీసీలకు సంబంధించి కొత్త ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాలు వివరాలు సేకరిస్తున్నాం. – కే రామకృష్ణరాజు, ఎంపీడీవో, రాజాం -
జెడ్పీలన్నీ గులాబీవే
సాక్షి, హైదరాబాద్: ఎంపీపీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన అధికార టీఆర్ఎస్ జెడ్పీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం 32 జిల్లాల్లో జెడ్పీపీ పదవులకు జరిగిన ఎన్నికల్లో 32 జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్షన్ పదవులన్నింటినీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. విపక్షాల నుంచి ఎక్కడా కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. సింగిల్ సెట్ నామినేషన్లతోనే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థులు బరిలో నిలిచి గెలిచారు. 20 జెడ్పీ పీఠాలను మహిళలు గెలుచుకున్నారు. తొలుత ఒక్కో జెడ్పీలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల చొప్పున ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించారు. జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన ఈ ఎన్నికల్లో కో ఆప్టెడ్ మెంబర్స్ ఎన్నికకు అధిక శాతం జిల్లాల్లో ఒక్కో నామినేషనే రావడంతో ఆ స్థానాల్లో వారు ఎన్నికైనట్లు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో మినహా జెడ్పీ ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. 32 జిల్లాల్లోని జెడ్పీ పదవులను గెలుచుకునే సంఖ్యాబలం అధికార టీఆర్ఎస్కు ఉండటంతో పోటీ అనేదే లేకుండా పోయింది. అంతేకాకుండా అన్ని జిల్లా పరిషత్‌లలో టీఆర్ఎస్ సభ్యులతో కూడిన కోరంతోనే సమావేశం నిర్వహించడంతో విపక్ష„ పార్టీల సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ముగిశాయి. జెడ్పీ పదవులు గెలుచుకునే సంఖ్యాబలం ఉండటంతో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల్లో వివిధ వర్గాలకు ప్రాధాన్యం కల్పించే చర్యలను టీఆర్ఎస్ అధిష్టానం చేపట్టింది. ప్రత్యేక సమావేశానికి ముందే జెడ్పీ చైర్పర్సన్ పదవులకు పోటీ పడుతున్న వారి పేర్లను ఆయా జిల్లాల పార్టీ ఇన్చార్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఏకగ్రీవ తీర్మానాలతో చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక ముగియడంతో పరిషత్ పోరు పూర్తయింది. అయితే ఎంపీపీ, జెడ్పీ పదవులకు ఎన్నికైన వారితోపాటు కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులంతా పాత పాలకమండళ్ల పదవీకాలం ముగిశాక జూలై మొదటి వారంలో పదవీ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. పట్నం సునీతారెడ్డి హ్యాట్రిక్... ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని రెండుసార్లు చేపట్టిన పట్నం సునీతారెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి) ఈసారి వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అంగోతు బిందు ఈ పదవిని చేపడతున్న పిన్న వయస్కురాలిగా నిలుస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన బిందు 23 ఏళ్ల వయసులోనే జిల్లా స్థాయిలో కీలక పదవిని చేపట్టనున్నారు. బయ్యారం జెడ్పీటీసీ స్థానానికి పోటీ ద్వారా తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరి కుమార్తె. నేతల కుటుంబ సభ్యుల గెలుపు... జెడ్పీ చైర్పర్సన్లుగా మాజీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి (కుమ్రం భీం ఆసిఫాబాద్), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కోరం కనకయ్య (భద్రాద్రి కొత్తగూడెం), స్వర్ణ సుధాకర్ (మహబూబ్‌నగర్) ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డా. అనితారెడ్డి, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి, యాదాద్రి జెడ్పీ చైర్‌పర్సన్‌గా దివంగత నేత, మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ్‌రెడ్డి తనయుడు ఎ. సందీప్‌రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా దాదన్నగారి విఠల్‌రావుకు అవకాశం లభించింది. నల్లగొండ జెడ్పీ చైర్‌పర్సన్‌గా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేసిన బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన గండ్ర జ్యోతికి (ఎమ్మెల్యే గ్రండ వెంకట రమణారెడ్డి సతీమణి) వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న లోక్నాథ్రెడ్డికి ఈసారి వనపర్తి జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం లభించింది. గతంలో వివిధ జెడ్పీల్లో వైస్ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహించిన వారికి చైర్పర్సన్ పదవులు లభించాయి. కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న డా. సుధీర్ కుమార్ ఇప్పుడు వరంగల్ అర్బన్ జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న రాయిరెడ్డి రాజిరెడ్డి తాజా ఎన్నికల్లో హుస్నాబాద్ జెడ్పీటీసీగా గెలుపొంది సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ అయ్యారు. ఎన్నికలు జరగని ఎంపీపీలకు విడిగా నోటిఫికేషన్... మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన 22 అధ్యక్ష, 26 ఉపాధ్యక్ష పదవులతోపాటు 18 కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు తేదీని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. మిగతా స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్ర, శనివారాల్లో కలిపి మొత్తం 513 మంది ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. మొత్తంగా టీఆర్ఎస్కు 429 ఎంపీపీలు, కాంగ్రెస్‌కు 62, బీజేపీకి 6, ఇండిపెండెంట్లకు 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌కు 2, సీపీఎం, టీడీపీలకు చెరో ఎంపీపీ అధ్యక్ష పదవులు లభించినట్లు ఎస్ఈసీ ప్రకటించింది. -
పరిషత్ పీఠాలు ఎవరివో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో తదుపరి ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలతోపాటు జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఎంపీపీ కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికలతోపాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. శనివారం జెడ్పీ కోఆప్టెడ్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారులు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించినందున ఎస్ఈసీ ప్రమేయం లేకుండానే ఎంపీపీల ఫలితాలను మండలాల్లో, జెడ్పీల ఫలితాలను జిల్లాల్లో వెంటనే వెలువరిస్తారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జెడ్పీ, ఎంపీపీ పదవులకు పరోక్ష పద్ధతుల్లో ఎన్నుకునే విధానం ఉండేది. అయితే, ఫలితాల వెల్లడి తర్వాత బేరసారాల నివారణ చర్యల్లో భాగంగా పరిషత్ పదవుల ఎన్నికకు ఎక్కువ వ్యవధి లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడంతో ఈ ఆనవాయితీ మారింది. ఎంపీ టీసీ, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణం చేయకుం డానే ఎంపీపీ అధ్యక్ష, జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఇలా ప్రమాణం చేయకుం డానే అధ్యక్ష, చైర్పర్సన్లను ఎన్నుకోవడం పంచాయతీరాజ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఎన్నికల ప్రక్రియ ఇలా... ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రతి మండలానికీ సదరు మండల ఎంపీడీవోను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తారు. సాయంత్రం 5 గంటల్లోగా ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికానున్నాయి. ఎంపీపీ కోఆప్టెడ్, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల కోసం ఉద్దేశించిన ప్రత్యేక సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. తొలుత కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఇందుకోసం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆ అభ్యర్థి ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటికి మించి నామినేషన్లు వస్తే మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుపుతారు. ఈ ఎన్నికలన్నీ కోరం ఉంటేనే నిర్వహిస్తారు. సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే వీటిని నిర్వహిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి చేతులు ఎత్తే పద్ధతిలో సభ్యులతో ఓట్లు వేయిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చినవారిని ఎన్నికైనట్టుగా ప్రిసైడింగ్ అధికారి ప్రకటిస్తారు. ఒకవేళ బరిలో ఉన్నవారందరికీ సమానమైన ఓట్లు వస్తే లాటరీ పద్దతిలో విజేతను ప్రకటిస్తారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తారు. కోఆప్టెడ్ పూర్తి కాకపోతే అధ్యక్ష ఎన్నికలు ఉండవు... ఒకవేళ ఏదైనా కారణంతో కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తి కాకపోతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగవు. ఈ విషయాన్ని ఎస్ఈసీకి తెలియజేస్తే ఈ ఎన్నికల నిర్వహణకు మరో తేదీని ప్రకటిస్తుంది. కోఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అవకాశం లేదు. అయితే కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక పూర్తయి ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక పూర్తి కాకపోతే మరో తేదీని ఎస్ఈసీ ప్రకటిస్తుంది. స్ఈసీ నిర్ణయించిన తేదీన నిర్వహించే ఎన్నికలకు కోరం లేకపోయినా ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవచ్చు. కాగా, తాము నియమించిన విప్‌లను మార్చే అవకాశం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కల్పించారు. అయితే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఉదయం 11 గంటలలోపు ప్రిసైడింగ్ అధికారులకు ఆ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తున్నట్టు గతంలో ఇచ్చిన వ్యక్తే మరోసారి లేఖ ఇవ్వాలి. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందితే అందుకు అనుమతిస్తారు. జులైలోనే బాధ్యతల స్వీకరణ... పాత పాలక మండళ్ల పదవీకాలం ఇంకా ముగియనందున కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, శుక్రవారం ఎన్నికయ్యే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, శనివారం ఎన్నికయ్యే జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవీకాలం వచ్చేనెల మొదటివారంలో మొదలు కానుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల పదవీ కాలం జూలై 3 వరకు, జెడ్పీటీసీల పదవీకాలం జులై 4 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయా తేదీల తర్వాతే కొత్త పరిషత్ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టు 5 తర్వాత ఎంపీపీ, ఆగస్టు 6 తర్వాత కొత్త జెడ్పీ చైర్పర్సన్లు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. -
టెన్షన్.. టెన్షన్
సాక్షి, భూపాలపల్లి : మరో నాలుగు రోజుల్లో పరిషత్ అభ్యర్థుల భవితవ్యం బాహ్య ప్రంచానికికి తెలియనుంది. జూన్ 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కించనున్నారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల కాస్త గుబులుగానే ఉన్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే పరిస్థితేంటి అనే రందిలో ఉన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగడం కూడా అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణానికి మరో కారణంగా చెప్పవచ్చు. స్థానికంగా ప్రాధాన్యం ఉన్న ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా స్థానికు వైపే మొగ్గు చూపారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీల కంటే లోకల్‌గా మంచి పేరున్న వ్యక్తికే ఓట్లు వేశారు. ప్రస్తుతం ఈ పరిణామాలే ప్రాధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. బయటకు ధీమాగా.. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పరిషత్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోప ఒకింత గుబులుగా ఉన్నారు. కార్యకర్తలు గెలుపు మనదే అని అంటున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం ఫలితాలు వెలువడే వరకు టెన్షన్ వాతావరణంలో కాలం గడపనున్నారు. కొన్ని ముఖ్యమైన స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ బ్యాలెట్ తెరిస్తే తప్ప వారి భవితవ్యాన్ని అంచనా వేయలేకపోతున్నారు. మరికొన్ని ప్రాదేశిక స్థానాల్లో స్వతంత్రులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలే టికెట్ రాకపోవడంతో స్వతంత్రులుగా బరిలో నిలిచారు. ముఖ్యంగా ఎంపీటీసీ స్థానాల్లో తీవ్ర పోటీ ఉంది. ఎక్కువ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. పార్టీలను చూసి జెడ్పీటీసీ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలు ఎంపీటీసీకి వచ్చే వరకు స్థానికంగా అందుబాటుతో ఉండే అభ్యర్థి వైపు సానుకూలంగా వ్యవహరించారు. పోటీ అధికంగా ఉన్న స్థానాల్లో రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ స్థానాల్లో గెలుపోటములపై ఇటు అభ్యర్థులు, అటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. లెక్కలేసుకుంటున్న ఆశావహులు మండల అధ్యక్ష పదవి చేపట్టేందుకు ప్రతీ పార్టీలో ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పలు పార్టీలు జెడ్పీ చైర్మన్ ఎంపికకు సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలనే స్పష్టత ఉన్నప్పటికీ ఎంపీపీల విషయంలో ఆ క్లారిటీ ఏ పార్టీలో కూడా లేదు. దీంతో కౌంటింగ్‌కు ముందే ఆశావహులు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంత మంది తమకు మద్దతు పలికే అవకాశం ఉంది. వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలా మెప్పించాలనే వ్యూహాల్లో ఎంపీపీ ఆశావహలు ఉన్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో ఆ మెత్తాన్ని ఇస్తాం.. మాకే మద్దతు ఇవ్వాలనే విధంగా ప్రలోభాలు చేసేందుకు ఆశావహులు వెనుకాడడం లేదు. అయితే కౌంటింగ్ అనంతరమే అసలు కథ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు ఎంపీపీ ఎన్నికకు మధ్య రెండు రోజులు సమయం ఉంది. ఈ సమయంలోనే ఆశావహులు ఎంపీటీసీల మద్దతు సంపాదించేందుకు కసరత్తు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో పరిషత్ స్థానాల వివరాలు ఎంపీటీసీ స్థానాలు – 106 పోటీలో ఉన్న అభ్యర్థులు – 325 మంది జెడ్పీటీసీ స్థానాలు – 11 పోటీచేసిన అభ్యర్థులు – 52 మంది -
జెడ్పీలపై టీఆర్ఎస్ నజర్
హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో పాగా వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కైవసం చేసే ఉద్దేశంతో వ్యూహం రచిస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. అనంతరం అన్ని జెడ్పీ, ఎంపీపీలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తోంది. ఎంపీపీలను గెలుచుకునే బాధ్యతను ఎమ్మెల్యేలకు, జెడ్పీలు గెలిచే బాధ్యతను ఉమ్మడి జిల్లాల మంత్రులకు అప్పగించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పని చేసి అన్ని పదవులను టీఆర్ఎస్ గెలుచుకునేలా వ్యవహరించాలని అధిష్టానం సూచించింది. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రుల ఆధ్వర్యంలో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయించిన వారికి జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కేలా, ఈ ఎన్నిక వ్యవహారాన్ని సాఫీగా పూర్తి చేసేందుకు ప్రతీ జిల్లాకు పార్టీ తరఫున ఓ ఇన్చార్జీని నియమిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాలకు పార్టీ తరఫున ప్రత్యేకంగాఇన్చార్జీలను నియమించారు. మిగిలిన జిల్లాలకు ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలోని ఎంపీటీసీలను సమన్వయపరిచాలని కేటీఆర్ ఆదేశించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి బాధ్యత అప్పగించారు. అలాగే గెలిచిన జెడ్పీటీసీలను వెంటనే మంత్రులు సమన్వయం చేసి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక సాఫీగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 158 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 4 జెడ్పీటీసీ స్థానాలను, 152 ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. పోలింగ్ జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలు జూన్ 4 వెల్లడికానున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలను సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మంత్రుల ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుల సమన్వయ ప్రక్రియ జరగనుంది. వరంగల్, మహబూబాబాద్ నేతలకు కేటీఆర్ అభినందనలు... లోక్‌సభ ఎన్నికల్లో బాగా పని చేశారని ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. వరంగల్ లోక్‌సభలో పసునూరి దయాకర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారని, మహబూబాబాద్‌లో మాలోతు కవిత మంచి ఆధిక్యంతో గెలిచారని అన్నారు. ఈ స్థానాల ఇన్‌చార్జీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయడం వల్లే టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు పసునూరి దయాకర్, మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు డి.ఎస్. రెడ్యానాయక్, టి.రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బి.శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బి.వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా అంతా సమన్వయంతో పని చేయాలని కేటీఆర్ ఆదేశించారు. అన్ని జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ పదవులు టీఆర్ఎస్ వారే ఎన్నికయ్యేలా వ్యూహం అమలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలకు ఇన్చార్జీలను నియమించారు. వరంగల్ అర్భన్–గుండా ప్రకాశ్‌రావు/దాస్యం వినయభాస్కర్, వరంగల్ రూరల్–పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ–బోడికుంటి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్–నాగుర్ల వెంకటేశ్వర్లు, ములుగు–నన్నపునేని నరేందర్, భూపాలపల్లి–బండా ప్రకాశ్‌ను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు టీఆర్ఎస్ ప్రకటన జారీ చేసింది. జెడ్పీలపై అధిష్టాన నిర్ణయం... మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఆయా ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే పూర్తి చేసుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించింది. ఎమ్మెల్యేల అభీష్టం మేరకు ఎంపీపీ పదవులను భర్తీ చేయాలని మంత్రులకు స్పష్టం చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులపై అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల వారీగా రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రం యూనిట్‌గా జెడ్పీ చైర్పర్సన్ పదవులకు అభ్యర్థులను నిర్ణయించనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక రోజున టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్టానం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది. దీనికి అనుగుణంగా జిల్లాల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశాలిచ్చింది. -
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ 4న
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలు, 534 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెట్టి అదే రోజు మధ్యాహ్నం నుంచి ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. ఫలితాలు వెలువడిన 2–3 రోజుల వ్యవధిలోనే అంటే 7వ తేదీన ఎంపీపీ అధ్యక్ష పదవులకు, 8న జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఆర్డినెన్స్‌ను జారీ చేసిన నేపథ్యంలో పరిషత్ ఓట్ల కౌంటింగ్‌ను చేపట్టేందుకు వీలు ఏర్పడింది. పరిషత్ ఫలితాలు ప్రకటించాక ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతుల్లో జెడ్పీ, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడ్డాక 2, 3 రోజుల్లోనే జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ సవరణలు... పరిషత్ ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నికలు నిర్వహిస్తే ప్రలోభాలకు అవకాశం ఉంటుందని వివిధ రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 27న కౌంటింగ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని ఎస్ఈసీ వాయిదా వేయడం తెలిసిందే. ఫలితాలు వెలువడ్డాక ఎక్కువ జాప్యం చేయకుండా జెడ్పీపీ, ఎంపీపీల ఎన్నిక నిర్వహణకు వీలుగా మార్గదర్శకాల్లో సవరణ చేయాలని కోరుతూ ఎస్ఈసీ రాసిన లేఖపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశం ద్వారా చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని, అయితే ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త చైర్పర్సన్లు, అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. తదనుగుణంగా గతంలోని నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జెడ్పీలు, ఎంపీపీలను ఎన్నుకునేందుకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో జడ్పీ చైర్పర్సన్లను జెడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులను ఎంపీటీసీలు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. వైస్ చైర్పర్సన్లు, ఎంపీపీ ఉపాధ్యక్షుల ఎన్నిక కూడా ఇదే తరహాలో జరుగుతుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వామపక్షాల్లో అంతర్మథనం...
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన వరస ఎన్నికల్లో తమకు పడిన ఓట్లు, అసెంబ్లీ నుంచి లోక్‌సభ వరకు వెలువడిన ఫలితాల తీరు పట్ల ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్మథనం సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచేంతగా ఈ పార్టీలకు సంస్థాగతంగా బలం లేకపోయినా, కనీస పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపకపోగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. కొంతకాలంగా వామపక్షాలకు సంప్రదాయ ఓటింగ్‌గా ఉన్న వర్గాలు కూడా దూరం కావడంపట్ల నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీల ప్రలోభాలకు జిల్లా, మండల, గ్రామస్థాయిల్లోని కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం లోనుకావడం, ఆయా పార్టీలకు అనుకూలంగా పనిచేయడం వంటి ఉదంతాలు పెరుగుతుండడంపట్ల ఈ పార్టీల్లో లోతైన సమీక్ష జరుగుతోంది. నిబద్ధత, అంకితభావంతో పనిచేసే కేడర్, నాయకులు క్రమక్రమంగా తగ్గిపోవడం, పార్టీ శ్రేణులకు నాయకత్వం భరోసా కల్పించలేకపోవడం వంటివి ఈ పార్టీలకు ప్రమాద సంకేతాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మిలిటెంట్ తరహా ఉద్యమాలు, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎడతెగని పోరాటాలు, రైతులు, కూలీలు, కార్మికులు, ఇతర వర్గాల పక్షాన నిలిచి పోరాడిన చరిత్ర ఈ పార్టీలకుంది.ఈ పరిస్థితికి భిన్నంగా మొక్కుబడి నిరసనలు, మీడియాలో ప్రచారంకోసం చేసే ఉద్యమాలకు పరిమితం అవుతున్నాయనే విమర్శలు కూడా ఈ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. 2004లో సీపీఐ, సీపీఎంలకు కలిపి 60 లోక్‌సభ స్థానాలకుపైగా ఉండగా, ప్రస్తుత ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకే పరిమితం కావడం వామపక్షాలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని ఎత్తిచూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులొకరు అన్నారు. ఇది ఒక్క తెలంగాణకే పరిమితమైన ట్రెండ్ కాదని, దేశవ్యాప్తంగా కూడా వామపక్షాలకు ఎదురుగాలి వీస్తున్నందున మారిన పరిస్థితులకు అనుగుణంగా వామపక్షశక్తుల పునరేకీకరణ జరగాల్సి ఉందని ఒక ముఖ్యనేత అభిప్రాయపడ్డారు. లోతైన విశ్లేషణలు, సమీక్షలు నిర్వహించి, లోపాలు, లోటుపాట్లను అధిగమించి స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. -
‘పరిషత్’ కౌంటింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పక్షాల విజ్ఞప్తికి రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) సాను కూలంగా స్పందించింది. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను వాయిదా వేసింది. ఈ నెల 27న నిర్వహించాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. మళ్లీ ఏ తేదీన కౌంటింగ్‌ను చేపట్టబోయేది త్వరలోనే ప్రకటించనున్నట్టు శుక్రవారం ఎస్ఈసీ తెలియజేసింది. జూలై 3న కౌంటింగ్ నిర్వహణ కోసం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఈసీకి ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను ప్రతిపాదించారు. ఫలితాల వెల్లడికి, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకోవడానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉండరాదని ఎస్ఈసీ అభిప్రాయపడుతోంది. అయితే, ఈవిధంగా చేయాలంటే నూతన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉందని, ఈ విషయంలో తగిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నామని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. కౌంటింగ్ తేదీని త్వరలోనే తెలియజేస్తామన్నారు. పరిషత్ ఫలితాల వెల్లడి తర్వాత జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకునేందుకు 40 రోజులకుపైగా సమయముంటే ప్రలోభాలు, అక్రమాలకు అవకాశమున్నందున ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ, అఖిలపక్ష బృందం వేర్వేరుగా ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశాయి. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, పరోక్ష పద్ధతుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జెడ్పీపీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకునే సమయాన్ని వీలైనంత తక్కువగా పెట్టాలని కోరాయి. అయితే, అధికశాతం బ్యాలెట్ బాక్సులను పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. కౌంటింగ్ ఆలస్యమైన కొద్ది ఈ విద్యాసంస్థల విద్యార్థులకు ఇబ్బంది కలగనున్నందున, ఈ అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీ భావిస్తోంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించాక ఆ తేదీని ప్రకటించనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతాపరమైన ఏర్పాట్లు, బ్యాలెట్‌బాక్స్‌ల స్టోరేజీకి సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ సూచించింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్‌రూమ్‌లకు సెక్యూరిటీని కొనసాగించాల్సిందిగా డీజీపీని కోరింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచించారు. రాజకీయపక్షాల విజ్ఞప్తి... ఈ నెల 27న ఓట్ల లెక్కింపునకు ఎస్ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో దానిని వాయిదా వేయాలని వివిధ రాజకీయపార్టీలు చేసిన విజ్ఞప్తులు, వాటిపై ఎలా స్పందించాలనే అంశం చర్చకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఈసీ వద్దకు వచ్చి జులై 3న కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ప్రత్యామ్నాయ షెడ్యూల్‌ను లేఖ రూపంలో అందజేశారు. దీంతో సోమవారం (27న) నిర్వహించాల్సిన పరిషత్ కౌంటింగ్ వాయిదా వేసేందుకు ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ నెల 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలైన ఓట్ల బ్యాలెట్ బాక్సులను రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లోని 536 స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. మొత్తం 123 కౌంటింగ్ సెంటర్లలోని 978 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం 11,882 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 23,647 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర ఎన్నికల సిబ్బందిని కూడా నియమించారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ఏర్పాటు చేశారు. సెలవుల అనంతరం విద్యాసంస్థలు తెరిచేలోగా, వర్షాకాలం మొదలయ్యే లోగా కౌంటింగ్‌ను ముగిస్తే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఎస్ఈసీ భావించింది. కోర్టులో విచారణకు రాబోతోందని...: టీపీసీసీ ఫలితాలు ప్రకటించిన 40 రోజుల తర్వాత పరిషత్ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణ ప్రలోభాలకు అవకాశం ఇస్తుందంటూ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కొందరు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినట్లు టీపీసీసీ అధికారప్రతినిధి ఇందిర శోభన్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో వేసిన ఈ పిటీషన్లు త్వరలోనే హియరింగ్ రానుండటంతో ప్రభుత్వం కౌంటింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించిందని ఆమె పేర్కొన్నారు. -
పోలింగ్ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి
-
ముగిసిన తెలంగాణ పరిషత్ ఎన్నికల పోరు
-
ముగిసిన పరిషత్ పోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 587 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి విడతలో 195 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ.. రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ.. మూడో విడతలో 124 జెడ్పీటీసీ,1343 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా.. మొత్తం 32,007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ఫలితాలు ఫలితాలు మే 27న వెల్లడికానున్నాయి. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : ముగిసిన తెలంగాణ పరిషత్ ఎన్నికల పోరు -
తెలంగాణలో రెండో విడత పరిషత్ పోలింగ్
-
తెలంగాణలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటలకు రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. నేడు (మే 10) జరగనున్న రెండో దశలో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే ముగియనుంది. మొత్తం 10,371 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఏర్పాటు చేసింది. -
తొలి సంగ్రామంలో 338 మంది
కరీంనగర్: మొదటి విడత ఎన్నికలు జరిగే జిల్లా, మండల పరిషత్ సంగ్రామంలో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు 34 మంది అభ్యర్థులు, 89 ఎంపీటీసీ స్థానాలకు 304 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఇల్లందకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, శంకరపట్నం, సైదాపూర్, వీణవంక జెడ్పీటీసీ స్థానాలకు 72 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణకు చివరి రోజైన ఆదివారం 38 మంది బరి నుంచి తప్పుకున్నారు. పోటీలో 34 మంది మిగిలారు. ఇల్లందకుంటలో నలుగురు, హుజూరాబాద్‌లో 5, జమ్మికుంటలో 5, మానకొండూర్‌లో 4, శంకరపట్నంలో 8, సైదాపూర్‌లో 3, వీణవంకలో 5 అభ్యర్థులు పోటీలో మిగిలారు. అత్యధికంగా శంకరపట్నం స్థానానికి ఎనిమిది మంది.. అత్యల్పంగా సైదాపూర్ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ స్థానాలకు 304 మంది పోటీ.. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని 89 ఎంపీటీసీ స్థానాలకు 304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు రోజుల పాటు మొత్తం 478 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు 174 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఎంపీటీసీ స్థానాలకు 304 మంది పోటీలో ఉన్నారు. ఇల్లందకుంటలో 33 మంది, హుజూరాబాద్‌లో 42, జమ్మికుంటలో 34, మానకొండూర్‌లో 61, శంకరపట్నంలో 44, సైదాపూర్‌లో 44, వీణవంకలో 46 మంది ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మానకొండూర్ మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు 61 మంది బరిలో నిలిచారు. అత్యల్పంగా ఇల్లందకుంట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది పోటీలో నిలిచారు. -
రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్ అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని తన కుటుంబం మాత్రమే పాలించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఉత్తమ్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో సంబంధాలుండి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం కాంగ్రెస్ భవిష్యత్‌కు మలుపు అని అన్నారు. మండలిలో జీవన్‌రెడ్డి తెలంగాణ ప్రజల గొంతుక కావాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన పనిచేయాలని కోరారు. నాడు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలతో కలసి మండలిలో సీఎల్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించే చిల్లర రాజకీయాలకు పాల్పడిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీలో సీఎల్పీని విలీనం చేస్తానంటూ వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటామని, పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారు... కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడం కేసీఆర్ తరం కాదని, తమ పార్టీ నుంచి జీవన్‌రెడ్డిలు పుడుతూనే ఉంటారన్నారు. తెలంగాణలో అత్యంత అవమానకర రాజకీయ పరిస్థితులున్నాయని, రాష్ట్రాన్ని కేసీఆర్ సొంత ఎస్టేట్‌గా భావిస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగి బీఫారాలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చేయి గుర్తు మీద గెలిచారు. గెలిచాక పార్టీ మీద భరోసా లేదంటూ పార్టీని వీడి వెళుతున్న వారిని ఏమనాలి? పార్టీ మీద భరోసా లేనప్పుడు ఎందుకు టికెట్ అడిగారు.. పోటీ చేసి ఎలా గెలిచారు? ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు.’అని భట్టి వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలితే అంతమందితో పోరాడతామే తప్ప కేసీఆర్ ముందు మోకరిల్లబోమని అన్నారు. కొన్నాళ్లు పోతే కేసీఆర్‌ను కుక్కలు కూడా కానని పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మేధావులు, విద్యావంతులు తనపై నమ్మకం ఉంచి గెలిపించార ని, దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజల పక్షాన మండలిలో గళం వినిపిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవ హారా ల ఇన్చార్జీ కుంతియా, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ తదితరులు ప్రసంగించిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ కో–ఆర్డినేటర్‌గా జీవన్‌రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన సమన్వయం వహిస్తారని పేర్కొన్నారు. -
‘తొలి పోరు’కు సిద్ధం..
చుంచుపల్లి: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 71 ఎంపీటీసీలు, 7 జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ప్రక్రియ 24వ తేదీన ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణకు జిల్లా అధికారులు ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. 25న నామినేషన్ల పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న వాటి పరిష్కారం ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణకు 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది. నామినేషన్ దాఖలు సందర్భంగా జెడ్పీటీసీ స్థానం జనరల్ అయితే రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. ఎంపీటీసీలకు జనరల్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల కోసం 443 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,190 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తొలి విడతలో అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. బూర్గంపాడు మండలానికి చెందిన 11 ఎంపీటీసీ స్థానాలకు పదవీ కాలం మరో ఏడాది పాటు ఉన్నందున వాటికి ఎన్నికలు నిర్వహించరు. ఇక్కడ జెడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక ఉంటుంది. 2,12,755 మంది ఓటర్లు... జిల్లాలోని అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల పరిధిలో 2,12,755 మంది ఓట్లు వేయనున్నారు. అశ్వాపురం మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 31,022 మంది, చర్లలో 12 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 30,625 మంది, దుమ్ముగూడెంలో 13 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 32,707 మంది, బూర్గంపాడు జెడ్పీటీసీ పరిధిలో 28,632 మంది, టేకులపల్లిలోని 14 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 37,548 మంది, పాల్వంచలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 26,323 మంది, ములకలపల్లిలోని 10 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 25,898 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత 7 మండలాల్లో రిజర్వేషన్లు ఇలా.. జిల్లా పరిధిలో 220 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీ స్థానాలుండగా వాటిలో బూర్గంపాడులోని 11 ఎంపీటీసీలకు ప్రస్తుతం ఎన్నికలు జరగవు. తొలి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అశ్వాపురం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించారు. చర్ల ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. దుమ్ముగూడెం ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. బూర్గంపాడులో కేవలం జడ్పీటీసీ ఎన్నిక మాత్రమే జరగనుండగా జనరల్ మహిళకు కేటాయించారు. పాల్వంచలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు రిజర్వు చేశారు. ములకలపల్లిలో ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు, జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు ఖరారు చేశారు. టేకులపల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక బరిలో నిలబడే జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు ప్రచారం నిమిత్తం ఖర్చు చేసేందుకు ఎన్నికల సంఘం పరిమితి విధించింది. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 7 మండలాల్లోని 71 ఎంపీటీసీ, 7 జెడ్పీటీసీ స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు ఆయా మండల కేంద్రాలలోనే స్వీకరిస్తారు. నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలలో పూర్తి విషయాలను పొందుపరచాలి. – డి.పురుషోత్తం, డిప్యూటీ సీఈఓ, ఎన్నికల లైజన్ అధికారి -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పంచాయతీ రాజ్ యాక్ట్ 285 ఏ సెక్షన్ సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం 50 శాతం లోబడే ఉండాలని చెబుతుందని కాబట్టి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీలకే పంచాయితీ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది రామచందర్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు కేటాయించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు వింటామన్న కోర్టు.. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. -
కేసీఆర్ పగటి కలలు కంటున్నారు : కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో మంత్రులు అవుతామని, చక్రం తిప్పుతామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు తెరిచారని, అత్యధికంగా రాష్ట్ర ఆధాయం మద్యం ద్వారా వస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మీద కాంగ్రెస్ హయాంలో వేలకోట్ల అవినీతి జరిగిందని.. దానిపై విచారణ చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఓడించారు.. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదరబాదరగా వెళ్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేదని, తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు శాతం మాత్రమే జెడ్పీ స్థానాలపై బీసీలకు కేటాయించారని, 34శాతం ఉన్న రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించారని ఇంకా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీసీలు ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు. ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరపాటుగా రాజకీయ దురుద్దేశంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము సమాయత్తం అవుతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలకు కార్యవర్గ సమావేశాలు జరిపి స్థానిక సంస్థల అభ్యర్థులను ఎన్నుకుంటామని తెలిపారు. రేపు పదాధికారులు, జిల్లా ఇంఛార్జీల సమావేశం ఉంటుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తామని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి సిద్దమా అని తాను ఓ సవాల్ విసిరానని.. అయితే ఇంత వరకు దానికి స్పందన లేదని అన్నారు. -
సమర్థులను పోటీకి దించండి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి షురూ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్సే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్ధులను పోటీకి దించండని నేతలను కోరారు. గ్రామస్థాయిలో వంద శాతం టీఆర్ఎస్ పార్టీ బలోపేతమవ్వాలని తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళణ తీసుకొని వస్తున్నామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు ధర్నాలు చేసినా పట్టించుకోవద్దని సూచించారు. జీహెచ్ఎంసీలో కూడా ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇంచార్జులను నియమించారు. ఈ ఎన్నికల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రధాన కార్యదర్శులకు కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మీని, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధును ప్రకటించారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్: త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో శుక్రవారం చర్చించారు. ఈ నెల 22 నుంచి మే 14 వరకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. అయితే ఫలితాలను మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారు. -
బ్యాలట్ పత్రాలు తారుమారు
తూర్పుగానుగూడెం (రాజానగరం), న్యూస్‌లైన్ :ప్రాదేశిక నియోజకవర్గాల పోలింగ్ సందర్భం గా తూర్పుగానుగూడెంలోని ఒక పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ పత్రాలు తారుమారవడంతో అర్ధగంటపా టు పోలింగ్ నిలిచిపోయింది. ఓటరు గుర్తించడంతో ఈ లోపం అధికారుల దృష్టికి వచ్చింది. గ్రామంలోని 29/10 నంబర్ బూత్‌లో మధ్యాహ్నం 2-10 గంట లకు ఓటు వేసేందుకు వెళ్లిన నాగవరపు సోమరాజు బ్యాలట్ పత్రంలో స్థానిక అభ్యర్థుల పేర్లు లేవని, పిఠాపురం మండలం చిత్రాడ అభ్యర్థుల పేర్లు ఉన్నాయని గుర్తించాడు. ఓటు వేయకుండా అతడు ఈ విషయాన్ని బహిరంగపర్చాడు. అప్పటికే ఆ బుక్‌లెట్‌లోని బ్యాలట్లలో పలువురు ఓట్లు వేయడంతో పోలింగ్ సిబ్బంది ఆదుర్దాకు లోనయ్యారు. వైఎస్సా ర్ సీపీ, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేకలు వేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఆర్వో డాక ్టర్ ఎం.రామకోటేశ్వరరావు, సహాయ రిటర్నింగ్ అధికారి పి.సుశీల అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అభ్యర్థులపేర్లు మారినప్పటికీ గుర్తులు అవే కావడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఉభయ పార్టీల వారిని సముదాయించడంతో తిరిగి పోలింగ్ మొదలైంది. పీఓ పై ఆర్డీఓ ఆగ్రహం ఇంతలో సమాచారం తెలిసి ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజ్ పీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాలట్ పత్రాలను పరిశీలించకుండా ఎలా వినియోగించారని నిలదీశారు. తాను సీరియల్ నంబర్లు పరిశీలించానని, పేర్లు మారిన విషయాన్ని గమనించలేదని పోలింగ్ అధికారిగా ఉన్న రంపచోడవరం ఫిషరీస్ అభివృద్ధి అధికారి వి.రమణారావు వివరణ ఇచ్చారు. ఈ దశలో అక్కడికి వచ్చిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, ఇతర పార్టీల నాయకులు కూడా దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బ్యాలట్ పత్రాలు మారడంతో తలెత్తిన పరిస్థితిని ఆర్డీఓ ఫోన్లో కలెక్టర్‌కు వివరించారు. తప్పుడు బ్యాలట్‌పై ఓటు వేసిన ఓటర్లను గుర్తించి, వారిచే మరోసారి ఓట్లు వే యించమని కలెక్టర్ సూచించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బ్యాలట్‌పై ఓటేసిన 38 మంది ఓటర్లలో 36 మందిని తిరిగి తీసుకువచ్చి ఓట్లు వేయించగలిగారు. ఎనిమిది బ్యాలట్ పత్రాలు సరిగానే... బూత్‌లో వినియోగించిన బ్యాలట్ బుక్‌లెట్‌లో మొదటి ఎనిమిది బ్యాలట్ పత్రాలు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు గుర్తించారు. సీరియల్ నంబర్ 1101 నుంచి 1150 వరకు ఉన్న ఈ బుక్‌లెట్‌లో 1101 నుంచి 1108 వరకు తూర్పుగానుగూడెం, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లతో ముద్రించి ఉండగా 1109 నుండి 1150 వరకు చిత్రాడ ఎంపీటీ సీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కాగా బ్యాలట్ పత్రాలు మారి న విషయమై వివరాల వెల్లడికి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏజేసీ జి.మార్కండేయులు నిరాకరించా రు. ఈసీ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామన్నా రు. పోలింగ్ తరువాత ఏజెంట్లకు పీఓ వివరాలు చెబుతారని, అప్పుడు మీరూ తెలుసుకోండని ఆయన సలహా ఇచ్చారు. -
ఎన్నికల నిర్వహణలో జిల్లా రోల్ మోడల్ కావాలి
సాక్షి, కాకినాడ :జిల్లాలో ఈ నెల 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి సంయుక్తంగా బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాలట్ బాక్సులను రిసెప్షన్ కేంద్రాల్లో తీసుకున్న తర్వాత గట్టి బందోబస్తుతో స్ట్రాంగ్ రూంలకు తరలించాలన్నారు. ఆ వాహనాల వెంబడి ఆర్ఓలు, ఏఆర్ఓలు తప్పనిసరిగా వెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం రోల్‌మోడల్‌గా వ్యవహరించిందని అభినందిస్తూ, పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే పంథాను అవలంబించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందని, పరిషత్ ఎన్నికల్లో కూడా ఇలాగే ఉండేలా చైతన్యం తేవడమే కాక, ఓటర్ల స్లిప్పులు అందరికీ పంచాలన్నారు. పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, టీడీఏ, డీఏల చెల్లింపులపై కలెక్టర్ అనంతరం సమీక్షించారు. అంతేకాకుండా బ్యాలట్ పత్రాల పరిశీలన ఒకటికి రెండుసార్లు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంలో వరుస క్రమంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రానివ్వొద్దన్నారు. పోలింగ్ కోసం అవసరమైన నిధులు ఎంపీడీఓల ఖాతాలకు బదిలీ చేశామన్నారు. పోస్టల్ బ్యాలట్‌పై కూడా ఉద్యోగులు దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని, ఇదే ఒరవడిని పరిషత్ ఎన్నికల్లో చూపాలన్నారు. రూట్ ఆఫీసర్లకు, జోనల్ ఆఫీసర్లకు, బ్యాలట్‌బాక్సుల తరలింపునకు డీటీసీ వాహనాలు సమకూరుస్తారన్నారు. సీఈఓ సూర్యభగవాన్ , డీఆర్ఓ యాదగిరి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
నిజాయితీ పరులకే ఓటేయండి
టౌన్(టౌన్), న్యూస్‌లైన్: పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. జిల్లాలో సుమారు 14.88 లక్షల ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 583 ఎంపీటీసీ, 46 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జెడ్పీ సీఈఓ మారిశెట్టి జితేంద్ర నిజాయితీ పరులకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణపై ‘న్యూస్‌లైన్’కు ఆయన వివరాలు వెల్లడించారు. న్యూస్‌లైన్: ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బందిని నియమించారు? ఏర్పాట్ల గురించి వివరిస్తారా.. జితేంద్ర: పోంగ్ ఆఫీసర్లగా 2,167 మంది, అదర్ పోలింగ్ ఆఫీసర్లగా 8,668 మందిని కలిపి మొత్తం 10,833 మందిని నియమించాం. మరికొంతమందిని రిజర్వులో ఉంచేందుకు తీసుకోబోతున్నాం. దాదాపు 4,000 బ్యాలెట్ బాక్సులు సరిపోతాయని అంచనా వేశాం. అయితే 5,000 వరకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నాం. జెడ్పీటీసీలకు తెలుపు రంగు, ఎంపీటీసీలకు పంక్ కలర్ రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశాం. ఇప్పటికే ప్రతి గ్రామానికి ఓటర్లజాబితాలను జిరాక్సు తీసి 25 సెట్లు పంపాం. న్యూ: సమస్యాత్మక గ్రామాలను గుర్తించారా? జితేంద్ర: పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన సమస్యాత్మక గ్రామాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. వీటి జాబితాను పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సి ఉంది. మా అంచనా ప్రకారం సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు దాదాపు 500 ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం. న్యూ: సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేందుకు తీసుకుంటున్న చర్యలేంటి? జితేంద్ర: సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుబందోబస్తును పెంచుతాం. ఇలాంటి గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. సమస్యాత్మక సెంటర్లో ఏమి జరుగుతుందో జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో మైక్రో అబ్జర్వర్ లేదా వీడియోగ్రఫీ లేదా వెబ్‌కాస్టింగ్ గాని ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ ఏమి జరిగినా తెలిసిపోతుంది. న్యూ: అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి... జితేంద్ర: ఎంపీటీసీ అభ్యర్థులు రూ.లక్ష , జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.రెండు లక్షల వరకు మాత్రమే ప్రచారానికి ఖర్చు చేయాలి. ఖర్చు చేసే ప్రతి పైసాకు రోజువారీ లెక్కలు చూపాలి. నామినేషన్ సందర్భంగా అభ్యర్థి ఆస్తులు, అప్పులు, తనపై గతంలో ఉన్న కేసులను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇందుకు భిన్నంగా ఉంటే అభ్యర్థి గెలిచినా తర్వాత ఎన్నికల కమిషన్ వారి పదవిని రద్దు చేసే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ తరపున ఒక కమిటీ వేస్తాం. ఈ కమిటీ పెయిడ్ ఆర్టికల్స్‌ను, అభ్యర్థి ఖర్చు వివరాలను అంచనా వేసి నివేదిక ఇస్తుంది. న్యూ: బ్యాలెట్ పేపర్లు ఎప్పుడు ముద్రిస్తారు? జితేంద్ర: 583 మంది ఎంపీటీసీలకు, 46 మంది జెడ్పీటీసీలకు కలిపి 33 లక్షల బ్యాలెట్ పేపర్లు అచ్చువేయాల్సి ఉంది. నామినేషన్లు పూర్తయ్యాక అభ్యర్థులను బట్టి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అక్షర క్రమంలో సెట్ చేసేదానికి కొంత సమయం పడుతుంది. ప్రశ్న: ప్రజలికిచ్చే సందేశం? జవాబు: డబ్బుకు, మద్యానికి, చీరకు అమ్ముడు పోయి ఓటేస్తామో అప్పుడు మనం నేతలకు బానిసైనట్టు లెక్క . ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీ పరులకే ఓటేయాలి. అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. -
స్థానిక సమరానికీ సై
సాక్షి, కడప : పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది.ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 20వతేదీ. ఎన్నికలను రెండు విడతల్లో ఏప్రిల్ 6,8 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ,559 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. 13,39,317 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1868 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. జెడ్పీటీసీ అభ్యర్థులు కడప జెడ్పీకార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వీలుగాడివిజన్కు ఒకటి చొప్పున మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులుగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, ఏజేసీ సుదర్శన్ రెడ్డి, డీపీఓ అపూర్వ సుందరిని నియమించారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల కార్యాలయాలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. మండల ప్రత్యేక అధికారులనే అయా మండలాలకు రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. నామినేషన్ నమూనా పత్రాలు ఇప్పటికే అన్ని మండల కార్యాలయాలకు చేరాయి.. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో రాజకీయ పార్టీ నేతలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సత్తా చాటుకునేందుకు.. ప్రాదేశిక పోరులో సత్తా చాటుకోవటం ద్వారా సాధారణ ఎన్నికలకు ముందే తమ బలాన్ని చూపాలన్న వ్యూహంలో పార్టీలు ఉన్నాయి. బలమైన అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో దింపాలనే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రాదేశిక పోరుపై దృష్టి సారించారు. మండలాల వారీగా గ్రామ స్థాయి నేతలతో నియోజక వర్గాల ఇన్‌ఛార్జిలు,ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తూ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిషత్ చెర్మన్ పదవి ఈసారి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థి వేటలో పడ్డాయి. మొత్తం మీద సార్వత్రిక సమరంతో పాటు ముంచుకొచ్చిన స్థానిక ఎన్నికలు ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారాయి. తమ నియోజక వర్గాల పరిధిలో పట్టు నిలుపుకునేందుకు, అధిక సంఖ్యలో తమ అనుచరులను గెలుపొందించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏర్పాట్లు సిద్దం! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
నేడు ‘పంచాయతీ’ నోటిఫికేషన్!
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు ఏప్రిల్ ఆరున పోలింగ్ 9న ఫలితాల వెల్లడి బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్ రంగం సిద్ధం చేస్తున్న అధికారులు ఇందూరు, న్యూస్‌లైన్: పంచాయతీరాజ్ ఎన్నికల నగారా మోగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను అదివారం ఖరారు చేసింది. అన్ని స్థానాలకు వచ్చేనెల ఆరున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. తొమ్మిదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిలోనే పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నామినేషన్ గడువు, ఎన్నికలు జరిగే తేదీ, ఫలితాల ప్రకటన, కోడ్ అమలు తదితర పూర్తి వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. వేగంగా కసరత్తు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేసిన నేపథ్యంలో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినప్పటికీ, మరోసారి వాటి లెక్కలను సరి చూసుకుంటున్నారు. మండలాలలో ఎన్ని బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి సిద్ధంగా ఉండాలని ప్రింటింగ్ ప్రెస్‌ల యాజమాన్యాలకు ముందస్తుగానే సమాచారం ఇ చ్చా రు. మండల కార్యాలయాలలో పని చేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పుడు ఎలాంటి సమాచారం అడిగినా వెంటనే తెలపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విషయమై కలెక్టర్ నేడో రేపో సంబంధిత అధికారులతో సమావేశమవనున్నట్లు తెలిసింది. అధికారులు.. జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లేదా ఆ స్థాయి అధికారి నియమించాలని ఎన్నికల సంఘం కలెక్టర్‌ను ఆదేశించింది. ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. జడ్పీటీసీ ఎన్నికలకు తెల్ల రంగు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగించనున్నారు. నామినేషన్ సెంటర్లు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేవారు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కా ర్యాలయంలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు మండల పరిషత్‌లోనే నామినేషన్లు వేయాలి. -
పోలీసులకు సవాల్
వరుస ఎన్నికలతో సతమతం సెలవులు రద్దు చేసిన పోలీసు శాఖ పటిష్ట బందోబస్తుకు ఏర్పాట్లు ముమ్మరం జిల్లాకు చేరుకోని అదనపు బలగాలు ఇప్పటివరకు 40 మంది బైండోవర్ ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉంది. వరుస ఎన్నికలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేయనున్నాయి. మార్చి 30న మున్సిపల్, నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఇందుకోసం పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని బలగాలు జిల్లాకు చేరుకున్నాయి. పట్టణాల్లో కవాతు కూడా నిర్వహిస్తున్నాయి. పోలీసులు రహదారులపై వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సెలవులు రద్దుమున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలున్న వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులకు 24 గంటలు విధుల్లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనారోగ్యంతో ఉన్నా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. బంధువుల శుభకార్యాలకు వెళ్లకూడదని, ఇతర ఎలాంటి పనులు పెట్టుకోవద్దనిన ఆదేశాలు జారీ చేశారు. వీరితోపాటు డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని వాతావరణం తెలుసుకోవాలని, ఇందుకు ప్రత్యేక పరిశీలన చేయాలని ఆదేశాలు వచ్చాయి. పటిష్ట బందోబస్తు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పొలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు నెలలు ప్రస్తుత సిబ్బందితోపాటు అదనంగా బలగాలు రానున్నాయి. పోలింగ్ బూత్‌లవారీగా సిబ్బంది ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ ప్లాటూన్లు, బాంబ్, డాగ్‌స్క్వాడ్ ప్రాంతాలవారీగా విభజించి తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లవారీగా భద్రతను ఏర్పాటు చేసి ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అదనంగా రెండు వేల బలగాలు.. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీసులు సరిపోదు. ఇప్పటికే పనిఒత్తిడిలో ఉన్న పోలీసులతోనే ఎన్నికల విధులు నిర్వర్తించడం కత్తిమీద సామే. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో మరో రెండు వేల మంది అదనపు బలగాలు అవరమున్నట్లు జిల్లా పోలీసు శాఖ గుర్తించింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు ప్రతిపాదనలు పంపించారు. నేడో, రేపో పోలీసు బలగాలు జిల్లాకు చేరుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ వంటి ప్లాటూన్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్లయింగ్‌స్వ్కాడ్ బృందాలు గస్తీగా తిరగనున్నారు. ఈ ప్రాంతాలతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న నాయకుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బట్టి గన్‌మెన్ ఎంపిక ఉంటుంది. ఎన్నికల సందర్భంగా జిల్లాలో రెండు రోజుల్లో 40 మందిని బైండోవర్ చేశారు. వీరితోపాటు సంఘ విద్రోహ శక్తులను గుర్తిస్తున్నారు. త్వరలో వీరిని కూడా అదుపులోకి తీసుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలపై నిఘా జిల్లాలోని ఐఎంఎల్ డీపో నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. పరిమిత సమయంలో వ్యాపారం చేయాలి. జిల్లాకు సంబంధం లేని మద్యం విక్రయాలు జరిపినా, రవాణా చేసిన చర్యలు తీసుకోనున్నారు. నాటుసారా విక్రయాలు, బెల్లంపట్టిక సరఫరా ప్రాంతాలపై నిఘా ఉంచనున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో దీని కోసం మూడు బృందాలు నిత్యం పరిశీలన చేసేందుకు ఏర్పాటు చేయనున్నారు. -
వీడని ఉత్కంఠ..!
పాలమూరు/ జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ త్వ రలో విడుదల కానున్నందున అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉ త్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల తేదీలకు అటు ఇటుగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టేందుకు ఈ నెల10న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ జాబితాను రూపొం దించడంలో అధికారులు తలమునకలయ్యారు. జెడ్పీ సీఈఓ ర వీందర్, డిప్యూటీ సీఈఓ నాగమ్మ, జెడ్పీ పరిధిలోని పలువురు సూపరింటెండెంట్లు రిజర్వేషన్ జాబితాను రూపొందించారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల జాబితా ఓ కొలిక్కి వచ్చినప్పటికీ.. ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్‌పై సమాచారం రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఆలస్యంగా రావడంతో పూర్తిస్థాయిలో జాబితాను విడుదల చేయలేకపోయారు. ఇందుకు సంబంధించి వేర్వేరుగా గెజిట్ విడుదల చేయడం కుదరదని ఎంపీపీల రిజర్వేషన్ పూర్తయ్యాక ఒకే గెజిట్‌తో ఎంపీటీసీ, జెడ్పీసీతో పాటు ఎంపీపీల రిజర్వేషన్లను విడుదల చేస్తామని జెడ్పీ సీఈఓ రవీందర్ పేర్కొన్నారు. అయిదు రోజులుగా రిజర్వేషన్ జాబితాను తయారు చే సేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 870 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2011 జనాభా పెరుగడంతో నియోజకవర్గ స్థానాలను పునర్నిర్మాణం చేశారు. ఆ లెక్కల ప్రకారం 870 ఉన్న స్థానాలకు 112 పెరిగి 982కు చేరుకున్నాయి. ఈనెల 10వ తేదీన ఎన్నికల షెడ్యుల్ వెలువడనుందని సీఈఓ పేర్కొన్నారు. ఏమాత్రం తప్పుల్లేకుండా జాగ్రత్తగా నియమనింబందనల ప్రకారం రిజర్వేన్ల ప్రక్రియను చేస్తున్నట్లు తెలిపారు.రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది. మార్పులు జరుగవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సీఈఓ తెలిపారు.