బ్యాలట్ పత్రాలు తారుమారు
Published Mon, Apr 7 2014 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM
తూర్పుగానుగూడెం (రాజానగరం), న్యూస్‌లైన్ :ప్రాదేశిక నియోజకవర్గాల పోలింగ్ సందర్భం గా తూర్పుగానుగూడెంలోని ఒక పోలింగ్ బూత్‌లో బ్యాలెట్ పత్రాలు తారుమారవడంతో అర్ధగంటపా టు పోలింగ్ నిలిచిపోయింది. ఓటరు గుర్తించడంతో ఈ లోపం అధికారుల దృష్టికి వచ్చింది. గ్రామంలోని 29/10 నంబర్ బూత్‌లో మధ్యాహ్నం 2-10 గంట లకు ఓటు వేసేందుకు వెళ్లిన నాగవరపు సోమరాజు బ్యాలట్ పత్రంలో స్థానిక అభ్యర్థుల పేర్లు లేవని, పిఠాపురం మండలం చిత్రాడ అభ్యర్థుల పేర్లు ఉన్నాయని గుర్తించాడు. ఓటు వేయకుండా అతడు ఈ విషయాన్ని బహిరంగపర్చాడు. అప్పటికే ఆ బుక్‌లెట్‌లోని బ్యాలట్లలో పలువురు ఓట్లు వేయడంతో పోలింగ్ సిబ్బంది ఆదుర్దాకు లోనయ్యారు. వైఎస్సా ర్ సీపీ, టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేకలు వేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఆర్వో డాక ్టర్ ఎం.రామకోటేశ్వరరావు, సహాయ రిటర్నింగ్ అధికారి పి.సుశీల అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అభ్యర్థులపేర్లు మారినప్పటికీ గుర్తులు అవే కావడం వల్ల ఎవరికీ నష్టం ఉండదని ఉభయ పార్టీల వారిని సముదాయించడంతో తిరిగి పోలింగ్ మొదలైంది.
పీఓ పై ఆర్డీఓ ఆగ్రహం
ఇంతలో సమాచారం తెలిసి ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజ్ పీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాలట్ పత్రాలను పరిశీలించకుండా ఎలా వినియోగించారని నిలదీశారు. తాను సీరియల్ నంబర్లు పరిశీలించానని, పేర్లు మారిన విషయాన్ని గమనించలేదని పోలింగ్ అధికారిగా ఉన్న రంపచోడవరం ఫిషరీస్ అభివృద్ధి అధికారి వి.రమణారావు వివరణ ఇచ్చారు. ఈ దశలో అక్కడికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, ఇతర పార్టీల నాయకులు కూడా దీనిపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బ్యాలట్ పత్రాలు మారడంతో తలెత్తిన పరిస్థితిని ఆర్డీఓ ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. తప్పుడు బ్యాలట్‌పై ఓటు వేసిన ఓటర్లను గుర్తించి, వారిచే మరోసారి ఓట్లు వే యించమని కలెక్టర్ సూచించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నారు. తప్పుడు బ్యాలట్‌పై ఓటేసిన 38 మంది ఓటర్లలో 36 మందిని తిరిగి తీసుకువచ్చి ఓట్లు వేయించగలిగారు.
ఎనిమిది బ్యాలట్ పత్రాలు సరిగానే...
బూత్‌లో వినియోగించిన బ్యాలట్ బుక్‌లెట్‌లో మొదటి ఎనిమిది బ్యాలట్ పత్రాలు సక్రమంగానే ఉన్నాయని రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు గుర్తించారు. సీరియల్ నంబర్ 1101 నుంచి 1150 వరకు ఉన్న ఈ బుక్‌లెట్‌లో 1101 నుంచి 1108 వరకు తూర్పుగానుగూడెం, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లతో ముద్రించి ఉండగా 1109 నుండి 1150 వరకు చిత్రాడ ఎంపీటీ సీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కాగా బ్యాలట్ పత్రాలు మారి న విషయమై వివరాల వెల్లడికి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏజేసీ జి.మార్కండేయులు నిరాకరించా రు. ఈసీ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామన్నా రు. పోలింగ్ తరువాత ఏజెంట్లకు పీఓ వివరాలు చెబుతారని, అప్పుడు మీరూ తెలుసుకోండని ఆయన సలహా ఇచ్చారు.
Advertisement
Advertisement