
తెలంగాణా సీఎం కేసీఆర్...సీఈఓ రజత్ కుమార్(పాత చిత్రం)
హైదరాబాద్: త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యుల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులతో శుక్రవారం చర్చించారు. ఈ నెల 22 నుంచి మే 14 వరకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. అయితే ఫలితాలను మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment