స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ త్వ రలో విడుదల కానున్నందున అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉ త్కంఠ నెలకొంది.
పాలమూరు/ జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ త్వ రలో విడుదల కానున్నందున అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉ త్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల తేదీలకు అటు ఇటుగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టేందుకు ఈ నెల10న నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ జాబితాను రూపొం దించడంలో అధికారులు తలమునకలయ్యారు. జెడ్పీ సీఈఓ ర వీందర్, డిప్యూటీ సీఈఓ నాగమ్మ, జెడ్పీ పరిధిలోని పలువురు సూపరింటెండెంట్‌లు రిజర్వేషన్ జాబితాను రూపొందించారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్‌ల జాబితా ఓ కొలిక్కి వచ్చినప్పటికీ.. ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్‌పై సమాచారం రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఆలస్యంగా రావడంతో పూర్తిస్థాయిలో జాబితాను విడుదల చేయలేకపోయారు. ఇందుకు సంబంధించి వేర్వేరుగా గెజిట్ విడుదల చేయడం కుదరదని ఎంపీపీల రిజర్వేషన్ పూర్తయ్యాక ఒకే గెజిట్‌తో ఎంపీటీసీ, జెడ్పీసీతో పాటు ఎంపీపీల రిజర్వేషన్‌లను విడుదల చేస్తామని జెడ్పీ సీఈఓ రవీందర్ పేర్కొన్నారు.
అయిదు రోజులుగా రిజర్వేషన్ జాబితాను తయారు చే సేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 870 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. 2011 జనాభా పెరుగడంతో నియోజకవర్గ స్థానాలను పునర్నిర్మాణం చేశారు. ఆ లెక్కల ప్రకారం 870 ఉన్న స్థానాలకు 112 పెరిగి 982కు చేరుకున్నాయి. ఈనెల 10వ తేదీన ఎన్నికల షెడ్యుల్ వెలువడనుందని సీఈఓ పేర్కొన్నారు. ఏమాత్రం తప్పుల్లేకుండా జాగ్రత్తగా నియమనింబందనల ప్రకారం రిజర్వేన్ల ప్రక్రియను చేస్తున్నట్లు తెలిపారు.రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది. మార్పులు జరుగవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుందని సీఈఓ తెలిపారు.