‘టీడీపీలో పనిచేసి అలసిపోయాం’ | Parvatha Bapanamma Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

‘టీడీపీలో పనిచేసి అలసిపోయాం’

Published Wed, Mar 13 2019 11:38 AM | Last Updated on Wed, Mar 13 2019 3:38 PM

Parvatha Bapanamma Joins YSR Congress Party - Sakshi

వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన బాపనమ్మ, రాజబాబు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశంలో పనిచేసి అలసిపోయామని మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ అన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీయిచ్చారని తెలిపారు. బాపనమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు, ఆయన భార్య జానకీదేవితో పాటు పలువురు బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తమ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారని అన్నారు. బేషరతుగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబుపై ప్రజలు కోపంగా ఉన్నారు
చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు నాయిని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత పథకాలు అమలుకు చంద్రబాబు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెడితేనే గాడిలో పడుతుందని, లేదంటే అప్పులపాలవుతుందని అభిప్రాయపడ్డారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement