Suryanarayana reddy
-
టీడీపీ నేత రామకృష్ణ రెడ్డి పై ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఫైర్
-
వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: ఎమ్మెల్యే సూర్యనారయణరెడ్డి
-
చంద్రబాబుకు దమ్మంటే నాపై పోటీచేయాలి: సూర్య నారాయణ సవాల్
సాక్షి, అనపర్తి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2వేల మంది కూడా పట్టని చోట సభ పెట్టాలనుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, సూర్యనారాయణ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జాన్యానికి దిగడం దారుణం. టీడీపీ నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ హయంలో ఏరోజూ అనపర్తిని పట్టించుకోలేదు. అనపర్తిలో ఎప్పుడూ కులాల ప్రస్తావన లేదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కులాల ప్రస్తావన తెస్తున్నారు. చంద్రబాబు పక్కన ఉన్న అవినీతిపరుల గురించి అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు. చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలి అని సవాల్ విసిరారు. -
Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ
రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!) -
ఒకే వేదికపై నారా, గాలి!
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శుక్రవారం బళ్లారిలో జరిగిన ఓ క్రికెట్ టోర్నీ వేడుకకు హాజరైన బీజేపీ ఎమ్మె ల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డిలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీల పరంగా వైరం ఉన్నా వాటిని పక్కనపెట్టి కొద్దిసేపు ఈ ఇద్దరు నేతలు ముచ్చటించుకోవడం గమనార్హం. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) -
దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయింది
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతిని రుజువు చేస్తానంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బుధవారం సత్య ప్రమాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిక్కవోలు గణపతి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఆయన భార్యతో కలిసి సత్యప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వినాయకుని సత్యనీతితో ప్రమాణం చేశా. రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదు. ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దేవుని దగ్గర దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయింది. అసత్య ఆరోపణలు చేసే వారికి మీడియా టైం కేటాయించొద్దు. రాబోయే రోజుల్లో రామకృష్ణా రెడ్డి ఆరోపణలు ఇక పట్టించుకోం. ఆయనవి పిచ్చివాగుడు గానే భావిస్తాం. ఈ రోజుతో రామకృష్ణారెడ్డితో పరస్పర ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టేశా. పిచ్చి వారి వాదనల్ని ఇకపై పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. ( కాపురంలో పొలిటికల్ చిచ్చు; స్పందించిన సుజాత) కాగా, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ప్రమాణం చేయటానికి మొదట వెనకడుగు వేశారు. ప్రమాణం తర్వాత చేద్దాం.. చర్చించుకుందామని అన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో సత్యప్రమాణం చేశారు. -
అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్
తూర్పు గోదావరి : జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఎనిమిది పదులు దాటినా తరగని ఉత్సాహం
టైగర్, కింగ్ కాంగ్, బొబ్బిలి పులి..ఇవి సినిమా పేర్లు..ఇవే అతనికి నిక్ నేమ్‌లు...ఈ పేర్లతో పిలిస్తేనే కిక్ ఉంటుందంటున్నారు ఆయన సన్నిహితులు. కట్ చేస్తే ఆయనొక 82 ఏళ్ల వెటరన్ క్రీడాకారుడు. 15 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. టెన్నిస్‌లో కూడా జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతకాలు సాధించాడు. బాడీ బిల్డింగ్‌లో కూడా లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు, పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆయనే మన భీమిలి దారాసింగ్ బోర సూర్యనారాయణ రెడ్డి. ఆయన బాట..ఆట ఈ నాటి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి. ఆ క్రీడాకారుడి విజయప్రస్థానం తెలుసుకుందాం. సాక్షి, తగరపువలస (భీమిలి): తిండి కలిగితె కండ కలదోయ్.. కండ గలవాడేను మనిషోయ్ అన్నారు మహాకవి గురజాడ. జవసత్వాలు నిండిన మనుషులే సుదృఢ భారత ఆకాంక్షలను నెరవేర్చగలుగుతారు. నిరాశా, నిస్పృహ, నిశ్శత్తువ నిండిన యువతరంలో క్రీడా స్ఫూర్తి, దేహదారుఢ్యం ప్రదర్శిస్తున్న వారిలో తగరపువలసకు చెందిన బోర సూర్యనారాయణరెడ్డి అనే 82 ఏళ్ల వెటరన్ క్రీడాకారుడు ముందంజలో ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్ క్రీడలలో కేరళ, ఒడిషా, మధ్యప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన పోటీలలో జాతీయస్థాయి పతకాలు సాధించారు. 15 ఏళ్లకే ఫుట్‌బాల్ తన ‘గోల్’ సాధించారు. ఈయన 1955 నుంచి 1970 వరకు ఫుట్‌బాల్‌లో జైత్రయాత్ర కొనసాగించారని చెప్పవచ్చు. అలాగే 1965 నుంచి 2000 వరకు టెన్నిస్‌లో కూడా విశేష ప్రతిభ కనపరిచారు. ఈ రెండు క్రీడలలోనూ పదుల సంఖ్యలో బంగారు పతకాలు, వందలాది రజక, కాంస్య పతకాలు అందుకున్నారు. దేహదారుఢ్యంలో ఉక్కు మనిషి యువకుడిగా ఉన్నప్పుడే ఆరడుగుల ఆజానుబాహుడుగా ఉండే సూర్యనారాయణరెడ్డి క్రీడలతో పాటు బాడీ బిల్డింగ్ పోటీలలో కూడా పతకాలు కొల్లగొట్టాడు. ఆయన దేహదారుఢ్యాన్ని చూసి పలువురు ముద్దుగా టైగర్, కింగ్ కాంగ్, బొబ్బిలి పులి అని పిలుచుకునేవారు. అప్పట్లో రూ.150లతో కొనుగోలు చేసిన బుల్ వర్కర్ ఆయన క్రీడాభివృద్ధికి, దేహదారుఢ్యానికి దోహదపడింది. వెండితెర దారాసింగ్‌ను చూసిన వారు అప్పటి నుంచి ఈయనను కూడా భీమిలి దారాసింగ్ అనేవారు. క్రీడాకారుడిగానే కాకుండా బాడీ బిల్డింగ్‌లో కూడా అనేక మంది సూర్యనారాయణరెడ్డి చూపిన మెలకువలు పాటించేవారు. క్రీడాకారుడిగా, బాడీ బిల్డర్‌గా ఈ ప్రాంతవాసులకు సుపరిచితమైన ఈయన ప్రస్తుతం వెటరన్ క్రీడాకారుడిగా కూడా పలు పతకాలు సాధించారు. గత ఏడాది వరకూ పోటీలు పాల్గొంటూ పతకాలు సాధించారు. అయితే గత కొంత కాలంగా పోటీలకు దూరంగా ఉంటున్నారు. భార్య రమణమ్మ కూడా వెటరన్ క్రీడాకారిణే భీమిలిలో కాంట్రాక్ట్ వర్కులు నిర్వహించే సూర్యనారాయణరెడ్డి పలువురు క్రీడాకారులకు ఇప్పటికీ మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. అంతే కాకుండా ఆయన భార్య రమణమ్మ (71) కూడా జాతీయ స్థాయి క్రీడాకారిణిగా పలు పతకాలు సాధిం చారు. గుంటూరు, బెంగళూరు, కేరళ వంటి రాష్ట్రాలలో భార్యాభర్తలు ఇరువురు కలిసి షార్ట్‌పుట్, జావెలిన్ త్రో, హేమర్ త్రో, డిస్క్ త్రో వంటి అథ్లెటిక్స్‌లో పదుల సంఖ్యలో బంగారు, రజత, కాంస్య పతకాలు వారి ఖాతాలో వేసుకున్నారు. లక్ష్యంపై గురి పెట్టాలి ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఎంచుకున్న లక్ష్యంపై గురి పెట్టాలి. నిత్యం అదే తపస్సులా భావించాలి. వెళ్లే దారిలో పూలు, ముళ్లు రెండూ ఉంటాయి. పూల సువాసన ఆస్వాదిస్తూ..ముళ్లను దాటేయాలి. అప్పుడే లక్ష్యం చేరుకోగలం. ముఖ్యంగా క్రీడల్లో గెలుపోటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఓటమి చెందితే కుమిలిపోకూడదు. గెలుపుపై మరింత కసి పెంచుకోవాలి..గెలిచి తీరాలి. క్రీడాకారులు నిత్యం వ్యాయామం చేస్తే ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు. –బోర సూర్యనారాయణరెడ్డి, వెటరన్ క్రీడాకారుడు -
‘టీడీపీలో పనిచేసి అలసిపోయాం’
సాక్షి, హైదరాబాద్: తెలుగు దేశంలో పనిచేసి అలసిపోయామని మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ అన్నారు. తమ కుటుంబానికి న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీయిచ్చారని తెలిపారు. బాపనమ్మతో పాటు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు, ఆయన భార్య జానకీదేవితో పాటు పలువురు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తమ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారని అన్నారు. బేషరతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు కోపంగా ఉన్నారు చంద్రబాబు తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు నాయిని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత పథకాలు అమలుకు చంద్రబాబు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని జగన్ చేతిలో పెడితేనే గాడిలో పడుతుందని, లేదంటే అప్పులపాలవుతుందని అభిప్రాయపడ్డారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ) -
పోరాడి...సాధించారు
ఏడేళ్ల కిందట పట్టాలు ఇచ్చారు...ఆ పట్టాల స్థలంలో ఇళ్లు కట్టుకోలేదని తాజాగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించడంతో లబ్ధిదారుల్లో అలజడి ప్రారంభమయింది. వందలాది మంది బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలిచింది. అనపర్తి కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్రిక్తతను గమనించిన మండల అధికారులు ఆర్డీఓతో చర్చించి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనపర్తి: నిరుపేదలకు సొంత గూడు కల్పించే దిశగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంతో అధికారులు దిగిరాక తప్పలేదు. బాధితులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవడంతో ఆందోళనను విరమించారు. అనపర్తి గ్రామ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో 2011లో 1709 మందికి ఇళ్లు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చినా ఇళ్లు కట్టుకోకపోవడంతో ‘పట్టాలు ఎందుకు రద్దు చేయకూడదంటూ’ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయటంతో వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న లబ్ధిదారులు అధికారులు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి మంజూరైన రుణాలు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, అప్పటి నుంచి రుణాలు మంజూరు కాకపోవటంతో నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టలేదని వివరించారు. వెంటనే ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పరిస్థితిని అధికారులు రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్‌ను ఫోన్లో సంప్రదించారు. అనంతరం 2011లో మంజూరు చేసిన ఇళ్ల పట్టాల్లో అర్హులైన లబ్ధిదారుల పట్టాలు రద్దు చేసేదిలేదని, అయితే గ్రామంలో లేని వారి పట్టాలను దర్యాప్తు చేసిన అనంతరం రద్దు చేస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐదున్నర గంటలపాటు సాగిన నిరసన కార్యక్రమానికి తెరపడింది. వైఎస్సార్సీపీ నాయకులు సత్తి వీర్రెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
'ఆ దాహమే భార్యను చంపేసింది'
శ్రీకాకుళానికి చెందిన మృత్యుంజయుని దీనగాథ చెన్నై, సాక్షి ప్రతినిధి : చెన్నైలో 11 అంతస్తుల అపార్టుమెంటు 61 మందిని పొట్టనపెట్టుకున్న విషయం విదితమే. 27 మందిని క్షతగాత్రులుగా మిగిల్చింది. శుక్రవారం ఒడిశాకు చెందిన ఒక యువకుడితోపాటు శ్రీకాకుళం జిల్లా కేబొమ్మాళి మండలం, గుడివాడ గ్రామానికి చెందిన చుక్కా మహేష్ శిథిలాల కింద నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్ర మాదం జరిగిన 66 గంటల తరువాత మృత్యుంజ యులుగా వచ్చి అబ్బురపరిచారు. అయితే అతను ఎవరికోసం జీవించాలన్న నిర్లిప్తతలో మునిగిపోయూడు. ఐదు నెలల క్రితం పెళ్లికాగా భార్య సుజాత కళ్లెదురుగానే భూమిలో కలిసిపోయింది. ఇద్దరూ ప్రేమించుకుని, గత ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు. సుజాత తల్లిదండ్రులు సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మి, సోదరి సునీత ప్రమాదం చోటుచేసుకున్న అపార్టుమెంటులో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రమాదానికి ముందు రోజే ఇక్కడికి వచ్చారు. 28వ తేదీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో కూర్చుని ఉండగా రెప్పపాటులో వారున్న చోటు భూమిలో కూరుకుపోయింది. తెలివి వచ్చేసరికి పడుకున్న స్థితిలో ఉన్న తమపై బలమైన ఇనుప గొట్టాలు వాటిపైన సిమెంటు ఫలకాలు ఉన్నట్లు మహేష్ తెలిపాడు. తాము నలిగిపోకుండా ఇనుపగొట్టాలు కాపాడాయన్నాడు. తామున్న చోటే వాటర్ క్యాన్ ఉండడంతో అందుకునే ప్రయత్నం చేశానని, ఇనుపగొట్టాలు కదిలి సిమెంటు దిమ్మెలు పైనబడి తాను చూస్తుండగానే సుజాత(23) శిథిలాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచిందని చెప్పాడు. తన దాహమే భార్యను దూరం చేసిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో మామ సూర్యనారాయణ రెడ్డి (47), మరదలు సునీత (19) చనిపోగా, అత్త లక్ష్మీ (35) ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మార్చురీలో ఉన్న భార్య సుజాత మృతదేహం కోసం రాయపేట ఆస్పత్రిలో మహేష్ కుంటుకుంటూ అధికారుల చుట్టూ తిరగడం చూపరులను కలచివేసింది. కాగా ఈ ప్రమాదంలో 38 మంది ఉత్తరాంధ్ర వారు చనిపోయినట్లు తేల్చారు. విజయనగరం జిల్లాకు చెందిన 24, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 14 మంది మృతుల్లో ఉన్నారు. శునకాల కృషి అపారం... జాతీయ విపత్తుల నివారణ బృందం వెంట ఉన్న రుస్తుం, దిల్ అనే శునకాలు శ్రీకాకుళం జిల్లా వాసి మహేశ్ సహా మొత్తం 9 మందిని రక్షించాయి.